
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cyber Crime On Serials Chance: సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ వైద్యురాలిని నమ్మించాడు.. తనదైన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఆమె అకౌంట్ల నుంచి విడతల వారీగా డబ్బులు వేయించుకున్నాడు. ఆమెకు సీరియల్స్ ఇష్టం కావడంతో సీరియల్స్‌లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి డబ్బులు వేయించుకుని అనంతరం పత్తా లేకుండాపోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆమె డబ్బులతో అతడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ ఉదంతం విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణంలో ఓ కార్ల షోరూమ్ ఉంది. ఆ షోరూమ్‌లో ఓ వ్యక్తి రూ.22 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కార్ల షోరూమ్ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ ఏఎస్ఐ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించాడు. ఆ డబ్బు పంపిన అకౌంట్ నంబర్ ఆధారంగా ఖమ్మంలోని ఓ మహిళా డాక్టర్‌ను సంప్రదించారు. మీరే నిందితురాలు అని ఏఎస్ఐ నిలదీయగా.. అయ్యో తాను అసలైన బాధితురాలినని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం జరిగింది ఏమిటో తెలుసుకుందాం. బాధితురాలి కథనంతో.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెంది ఓ డాక్టర్ భార్యకు సోషల్ మీడియా ద్వారా విశాఖపట్టణంలోని మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ బాధితురాలి కథనంతో.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెంది ఓ డాక్టర్ భార్యకు సోషల్ మీడియా ద్వారా విశాఖపట్టణంలోని మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త పెరగడంతో ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాడు. ఆమెకు సీరియల్స్ ఇష్టమని గుర్తించి 'మీకు సీరియల్స్‌లో నటించే అవకాశం ఇస్తా' అని నమ్మబలికాడు. ప్రముఖ ఛానల్లో సీరియల్స్‌లో ఓ పాత్ర ఇప్పిస్తానని ఆశచూపి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని నిందితుడు ఆమెకు చెప్పాడు. ఇక్కడే ట్విస్ట్.. అలా ఆమెతో జంబాడ లక్ష్మీ వరప్రసాద్ వరుసగా డబ్బులు పంపించుకున్నాడు. కొద్ది రోజులకు ఆమె అకౌంట్ నుంచి రూ.22 లక్షల డబ్బును విశాఖలోని కార్ల షోరూమ్ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. దీంతో ఓ ఖరీదైన కారు డాక్టర్ డబ్బులతో కొనుగోలు చేశాడు. అయితే అవకాశం ఇస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఆమె సైబర్ నేరగాడి వలలో చిక్కినట్లు గ్రహించారు. వెంటనే వైద్యుడి భార్య తెలంగాణ సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు నిందితుడు కొనుగోలు చేసిన కార్ల షోరూమ్ అకౌంట్‌ను కూడా ఫ్రీజ్ చేశారు. తమ అకౌంట్ ఫ్రీజ్ కావడంతో కార్ల యజమాని విశాఖలోని కంచరపాలెం పోలీసులను తెలంగాణకు పంపించారు. దీంతో అసలు కథ బయటపడింది. బాధితురాలి కథను తెలుసుకున్న పోలీసులు నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్ కోసం వెతుకుతున్నారు. ఇటు విశాఖపట్టణం పోలీసులు.. అటు తెలంగాణ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుని కార్ల యజమానితోపాటు తెలంగాణలోని వైద్యుడి భార్యకు కూడా న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అత్యధికులు విద్యావంతులే కాగా సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మోసానికి పోవడానికి రెడీగా ఉన్నామన్నట్టు బాధితుల వ్యవహార శైలి కనిపిస్తోంది. అయితే సైబర్ నేరస్తుల బారిన పడుతున్న వారిలో అత్యధికులు విద్యావంతులే ఉంటుండడం గమనార్హం. ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా సులువుగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కళ్ల ముందు మోసపోతున్నా తెలియకుండా పోతున్నారు.