
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. చాలా మంది స్టార్ ప్లేయర్లున్నా ముంబై జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ సారథ్యం నుంచి పాండ్య వైదొలుగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొక అంశం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబై కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. 'రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల క్రితం రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యను ముంబై యాజమాన్యం నియమించింది. ఇక అప్పటి నుంచి ఎంఐ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసిన పొరపాట్లను ముంబై సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు అతడి మద్దతు తప్పనిసరిగా ఉండాలి’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో జట్టు మారాలని భావిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఎవరైనా Home » Sports » Cricket News » hardik pandya likely to step down as mumbai indians captain after ipl 2026 season smr ABN , Publish Date - May 29 , 2026 | 04:37 PM ‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో జట్టు మారాలని భావిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఎవరైనా ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్తో మంచి వాతావరణం లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పాండ్య పరిస్థితి కూడా ఇంతే. కాబట్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’ అని ముంబై క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను: వైభవ్ వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్