ఇక్కడ అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిందని చెబుతున్నా.. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా సంతకం చేయలేదని తెలిసింది. 60 రోజుల పాటు చర్చలు సాగుతాయని కూడా తెలుస్తోంది. ఇది యుద్ధం ముగింపుపై ఇంకా అనిశ్చితినే మిగిల్చింది. ఇటు డీల్ అంటూనే.. రెండు దేశాల మధ్య దాడులు జరుగుతుండటం కూడా అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్ని కల్పించింది. మరోవైపు.. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాలు కూడా కారణం అయ్యాయని తెలుస్తోంది. ఈసారి వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువగా 92 శాతమే రుతుపవనాల వర్షపాతం నమోదవుతుందని అంచనాల్ని వెలువరించింది. ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండటం వల్ల ఇది వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతోంది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయగా.. మార్కెట్ల భారీ పతనానికి అసలు కారణం ఇంకొకటి ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే MSCI రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (MSCI) ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లను ఇవాళ ఆఖర్లో పడేసిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు.. MSCI ఇండెక్స్‌ను ఫాలో అవుతుంటాయి. ఇక ప్రతి కొన్ని నెలలకు ఓసారి ఎంఎస్సీఐ తన ఇండెక్స్‌లో కంపెనీల్ని చేర్చడం, లేదా తొలగించడం, లేదా వాటి వెయిటేజీల్ని మార్చడం వంటివి చేస్తుంటుంది. దీనినే రీబ్యాలెన్సింగ్ లేదా రీజిగ్ అంటారు. ఈ మార్పులు.. ఇవాళ మార్కెట్ క్లోజింగ్ చివర్లో అమల్లోకి రావడంతో.. పాసివ్ ఫండ్స్ భారీ స్థాయిలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాయి. దీంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రముఖ మార్కెట్ నిపుణులు నూరేష్ మెరానీ ప్రకారం చూస్తే.. ఈసారి భారత మార్కెట్‌పై ఆఖరి అరగంటలో దాదాపు 800 మిలియన్ ప్రముఖ మార్కెట్ నిపుణులు నూరేష్ మెరానీ ప్రకారం చూస్తే.. ఈసారి భారత మార్కెట్‌పై ఆఖరి అరగంటలో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు నెట్ ఔట్ ఫ్లో ప్రెజర్ కనిపించింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 6800- 8500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో చివరి అరగంటలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరిపారు. ఈసారి ఎంఎస్సీఐ స్టాండర్డ్ ఇండెక్స్‌లో ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎంసీఎక్స్, నాల్కో వంటి కంపెనీల్ని చేర్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వీటికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా హ్యుందాయ్ మోటార్ ఇండియా, కల్యాణ్ జువెల్లర్స్, జూబ్లియెంట్ ఫుడ్‌వర్క్స్, ఆర్వీఎన్ఎల్ వంటి స్టాక్స్‌ను.. ఈ ఇండెక్స్ నుంచి తొలగించారు. దీంతో వీటిపై ఔట్‌ఫ్లో ప్రభావం కనిపించింది. పలు హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ సహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ గ్రూప్.. కంపెనీల వెయిటేజీల్లో కూడా MSCI రీజిగ్ ఎఫెక్ట్ కనిపించింది. ఇక్కడ కూడా మార్పులు చోటు చేసుకోగా.. షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ మార్పుల కారణంగానే కొన్ని స్టాక్స్‌లో.. అసాధారణ ట్రేడింగ్ వాల్యూమ్స్ నమోదయ్యాయి. సోమవారం నుంచి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.