
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan johar)కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! దీంతో సోషల్ మీడియాలో రకరకాలు రూమార్లు హల్చల్ చేస్తున్నాయి. ఆయా హీరోలు, హీరోయిన్లు, మేకర్స్‌తో కరణ్‌కు చెడిందని, ఇతర వ్యాపార లావాదేవీలు అందుకు కారణమని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కొంతకాలంగా ఆయన షారుక్‌ఖాన్, అనన్యాపాండే, అలియాభట్ వంటి స్టార్లను ఫాలో కావడం లేదు. తాజాగా దీనిపై కరణ్ క్లారిటీ ఇచ్చారు. ‘సినీ సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం నేషనల్ న్యూస్‌గా మార్చాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒకరిని ఫాలో కాకపోవడం, కావడం అనేది పెద్ద వార్తేమీ కాదు. దీనిని సోషల్ మీడియా పెద్దది చేసి చూపిస్తుంది. ఇది కేవలం డిజిటల్ డిటాక్స్ మాత్రమే. ఈ మధ్యన నేను ఇన్‌స్టా మీద ఎక్కువ సమయం గడుపుతున్నా. దాంతో నా విలువైన సమయం చాలా వేస్ట్ అవుతుందని గ్రహించా. దీనిని తగ్గించుకోవడానికి చాలామందిని అన్‌ఫాలో చేశా. ఇదేమీ పెద్ద న్యూస్ కాదు. దయచేసి మీ క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం సంచలనంగా మార్చవద్దు. మీకు వ్యూవర్షిప్ కావాలంటే ఇంకేదైనా చేసుకోండి. ఇది మీకు అనవసరమైన విషయం’ అని అన్నారు. ప్రస్తుతం కరణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కేవలం 48 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రాతోపాటు పలు నిర్మాణ సంస్థలు, సేవా సంస్థలు ఉన్నారు. Home » Bollywood » Karan Johar Clarifies Instagram Unfollow Buzz avm ABN , Publish Date - May 29 , 2026 | 06:13 PM