
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prof Nageshwar Case: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే ముందు ప్రొఫెసర్ కన్న ముందు తనను అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఆంధ్రవాళ్లు ఇంకా తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి వెళ్లిపోవచ్చు కదా అని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు. Also Read: TV Serial Chance: టీవీ సీరియల్ పేరిట డాక్టర్‌కు కుచ్చుటోపీ.. తీగలాగితే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజార్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు సీఎస్ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య సాగుతున్న వివాదంపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్టు అని.. ఆయనపై కేసులు ఎలా పెడతారని? ప్రశ్నించారు. Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే? జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబుతో.. తర్వాత అమిత్ షాతో ఆ తర్వాత వైఎస్ జగనతో కూడా ప్యాకేజీ తీసుకుంటాడేమో అని పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేయాల్సి వస్తే ఆయన ఇంటి ముందు తానే ముందు వచ్చి అరెస్టు అవుతానని ప్రకటించారు. 'అమరావతికి అన్ని కోట్లు ఎందుకని.. ఆంధ్రవాళ్లు అందరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కదా. ఇక్కడే తాము 5000 ఎకరాలు ఇస్తామని ఇక్కడే రాజధాని కట్టుకొని ఇక్కడ నుంచి ఏపీ పరిపాలన కొనసాగించండి' అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజీనామా పర్వం ఏమైనా ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన సమర్థవంతంగా జరుగుతోందని.. రేవంత్ రెడ్డి రాజీనామా అనే అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేదు అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి.. ఆయన ఇంటి ముందు నేను నిలబడతా. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలైతది' అని హెచ్చరించారు. అయినా మీరంతా ఉండేది హైదరాబాద్‌లోనే కదా? అన్ని డబ్బులు పెట్టి అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు? అని నిలదీశారు.