
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi)- కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ (Kannada Actor Rajkumar)ల మధ్య మంచి అనుబంధం ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది. చిరు- రాజ్‌కుమార్ కలిసి నటించలేదు గానీ వారి వారసులు యాక్ట్ చేయడం విశేషం. ‘పెద్ది’.. ఈ ఇద్దరినీ కలిపింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్‌చరణ్ (Ram Charan), శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar).. ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్‌తో కలిసి స్పెషల్ చిట్‌చాట్‌లో సందడి చేశారు. ఇందులోనే.. కొన్నేళ్ల క్రితం రాజ్‌కుమార్- చిరంజీవికి సంబంధించిన స్టిల్‌ను చూపిస్తూ దానిని రీ క్రియేట్ చేయమని శివరాజ్‌కుమార్- చరణ్‌లను హోస్ట్ విజ్ఞప్తి చేశారు. వెంటనే శివన్న.. రామ్‌చరణ్‌ను హగ్ చేసుకుని, ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. సంబంధిత స్టిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. హోస్ట్ చూపించిన ఫొటో.. రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్ నిర్మాణ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో తీసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘భక్త కుంబార’ (1974)లో శ్రీదేవి బాలనటిగా యాక్ట్ చేశారు. శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ‘పెద్ది’లో శ్రీదేవి తనయ జాన్వీ హీరోయిన్ కావడం విశేషం. ఆమెతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్న శివన్న.. తమ కాంబినేషన్లో రెండు సీక్వెన్స్‌లు ఉంటాయని తెలిపారు. ‘పెద్ది’ విషయానికొస్తే.. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో శివన్న (శివరాజ్‌కుమార్) శిష్యుడిగా చరణ్ కనిపించనున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.