
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్ వీడి బయటకు వస్తాడని ప్రచారం సాగుతోంది. దీంతో అతడిని సొంతం చేసుకొనేందుకు పోటీ తప్పకుండా ఉంటుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఇలా కెప్టెన్ అవసరమున్న టీమ్‌లు ఉన్నాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు తీసుకోవాలనే వారూ లేకపోలేదు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్‌కు పాండ్యను సీఎస్కేలోకి తీసుకోవాలని సూచించాడు. ట్రేడింగ్‌లో ఇద్దరు సీఎస్కే ఆటగాళ్లను ట్రాన్స్ఫర్ చేయాలని తెలిపాడు. ‘‘ఒకవేళ నేనే మంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్ అయి ఉంటే.. సీఎస్కే నుంచి శివమ్ దూబే, ఆయుష్ మాత్రేను తీసుకొనేవాడిని. హార్దిక్ పాండ్యను వారికి ఇచ్చేవాడిని. హార్దిక్ రాకతో చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే సంజు శాంసన్‌ను సారథిగా చేయాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ పాండ్య వచ్చి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. అతడికే అవకాశం ఇస్తా. ఎంఎస్ ధోనితో పాండ్యకు మంచి అనుబంధం ఉంది. సీఎస్కేకు అతడు వస్తే సమతుల్యం అవుతుంది’’ అని బద్రీనాథ్ విశ్లేషించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.