
మేడిపండు మాదిరిగా చూడ్డానికి ఆకర్షణీయంగానే కనిపించినా.. మార్కెట్లో చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో సోంపు కూడా చేరిపోయిందంటోంది ‘గుజరాత్ ఆహార భద్రతా విభాగం’. ఇటీవలే అక్కడ జరిపిన ఆహార భద్రతా తనిఖీల్లో సోంపు కల్తీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మేడిపండు మాదిరిగా చూడ్డానికి ఆకర్షణీయంగానే కనిపించినా.. మార్కెట్లో చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో సోంపు కూడా చేరిపోయిందంటోంది ‘గుజరాత్ ఆహార భద్రతా విభాగం’. ఇటీవలే అక్కడ జరిపిన ఆహార భద్రతా తనిఖీల్లో సోంపు కల్తీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అందులో కల్తీ ఎంత మేర ఉందో తెలుసుకోవడానికి దాని నమూనాల్ని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారట! ఇలా సోంపు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల భద్రతపై మరోసారి ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కొనే సోంపు అసలైందా? కల్తీనా? కనిపెట్టాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. సోంపును కొందరు మౌత్ ఫ్రెష్నర్గా వాడితే.. మరికొందరు వంటకాలు, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వంటలకు అమోఘమైన రుచిని అందించే ఈ పదార్థం ఎన్నో పోషకాల మిళితం అంటున్నారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ నిండి ఉండే సోంపు.. జీర్ణ శక్తిని పెంచడంలో, నోటి దుర్వాసనను దూరం చేయడంలో, బరువు అదుపులో ఉంచుకోవడానికి, గుండె ఆరోగ్యానికి, నెలసరి సమస్యల్ని దూరం చేసుకోవడానికి.. ఇలా దీంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. అయితే ఈ రోజుల్లో చాలావరకు ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నట్లే.. సోంపు కూడా వివిధ రకాలుగా కల్తీ అవుతోందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించాలని కృత్రిమ రంగులు, రసాయనాలు కలపడం; సోంపును పోలిన గడ్డి గింజల్ని ఇందులో కలిపి విక్రయించడం.. అయితే ఈ రోజుల్లో చాలావరకు ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నట్లే.. సోంపు కూడా వివిధ రకాలుగా కల్తీ అవుతోందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించాలని కృత్రిమ రంగులు, రసాయనాలు కలపడం; సోంపును పోలిన గడ్డి గింజల్ని ఇందులో కలిపి విక్రయించడం.. ఇలా కలుషితమైన ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. ముఖ్యంగా వికారం, వాంతులు, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి, విరేచనాలు, గొంతులో అలర్జీ.. వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు; కాలేయ, మూత్ర పిండాల సంబంధిత అనారోగ్యాలున్న వారికి ఈ కల్తీ సోంపు మరింత హానికరం అంటున్నారు. అలాగే వీటి మెరుపును పెంచడానికి కలిపే సింథటిక్, కృత్రిమ రంగులతో.. కొంతమందిలో తలనొప్పి, మగతగా అనిపించడం, చర్మ అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. అయితే ఇలా కల్తీ అయిన సోంపు తిని.. ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకోవడం కంటే.. కొనే ముందే కల్తీని గుర్తించి జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు. ⚛ అసహజ రంగు, మెరుపు, గింజలన్నీ ఒకే రకంగా ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే.. ఆ సోంపు కల్తీ అయినట్లుగా గుర్తించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే సహజసిద్ధంగా లభించే సోంపు అంతా ఒకే రంగులో ఉండదట. కాబట్టి గింజలన్నీ అసమాన షేడ్స్‌లో ఉన్నవి, ప్రకాశవంతంగా కనిపించని సోంపును ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు. ⚛ కొన్ని సోంపు గింజల్ని అరచేతిలోకి తీసుకొని బాగా నలపాలి. లేదంటే ఒక తడి టిష్యూపై వాటిని ఉంచాలి. అదీ కాదంటే ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో వాటిని వేయాలి. ఈ క్రమంలో రంగు అరచేతులకు అంటుకున్నా, టిష్యూపై పరచుకున్నా, నీళ్ల రంగు మారినా.. వాటిలో కృత్రిమ రంగులు కలిపారని అర్థం. ⚛ సహజంగా ఉండే వాసనతో కాకుండా సోంపు వాసన మరీ గాఢంగా ఉన్నట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలంటున్నారు నిపుణులు. అలాంటి వాటిని ఎంచుకోకూడదంటున్నారు. ⚛ రుచితో కూడా సోంపు కల్తీ అయిందా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని గింజలను నోట్లో వేసుకొని చప్పరించాలి. ఘాటుగా, చేదుగా, సబ్బు రుచి మాదిరిగా నోటికి తగిలితే అది కల్తీ అయినట్లు అర్థమట! అలాకాకుండా ఒక రకమైన తియ్యటి రుచితో ఉన్నట్లయితే దాన్ని అసలైన సోంపుగా భావించాలంటున్నారు నిపుణులు. ⚛ కొంతమంది ముందస్తుగా ప్యాక్ చేయని (లూజ్) ఆహార పదార్థాల్ని కొంటారు. అలాకాకుండా ప్యాక్ చేసినవి; దానిపై తయారీ, ఎక్స్పైరీ తేదీలు పరిశీలించి; FSSAI సర్టిఫికేషన్ ఉందని గుర్తించాకే ఏ పదార్థాన్నైనా కొనడం మంచిదంటున్నారు నిపుణులు. సోంపు కొనే విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. ⚛ తక్కువ ధరకొస్తున్నాయని ఆయా ఆహార పదార్థాల్ని కొనడం చాలామందికి అలవాటు. సోంపు కూడా ఇలాగే కొంటున్నారా? అయితే ఆ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. నాణ్యత కొరవడడమో లేదంటే కల్తీ జరగడం వల్లో ఆయా పదార్థాలు చవకగా లభిస్తున్నట్లు గ్రహించమంటున్నారు. కాబట్టి సోంపు కొనే విషయంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. కల్తీ మాయలో పడకుండా జాగ్రత్తపడచ్చు.. తద్వారా ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవచ్చు.