
Unclaimed assets | దిల్లీ: బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో ఎవరూ క్లెయిమ్ చేయని ఆస్తులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఏకీకృత పోర్టల్ తీసుకొచ్చింది. ఇందులో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో క్లెయిమ్ చేయని మొత్తాలకు సంబంధించి సెర్చ్ చేసే వీలుంటుంది. ఇందుకోసం www.unclaimedassetsportal.in అనే పోర్టల్‌ను శుక్రవారం ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ‘మీ సొమ్ము మీ హక్కు’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చినట్లు ఆర్థికశాఖ కార్యదర్శి(సేవలు) ఎం. నాగరాజు తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి UDGAM, బీమాకు సంబంధించి ఐఆర్డీఏఐ బీమా భరోసా, మ్యూచువల్ ఫండ్స్ కోసం సెబీ మిత్ర, షేర్లు డివిడెండ్లకు సంబంధించి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీకి వేర్వేరు పోర్టళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకేచోట చేర్చడమే ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.