
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే... స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో రాజస్థాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్లో ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 పై చిలుకు పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2016 సీజన్లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్ Home » Sports » Cricket News » vaibhav suryavanshi creates new ipl powerplay record in qualifier 2 against gujarat titans smr ABN , Publish Date - May 29 , 2026 | 09:09 PM