
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ను తన విరోచిత ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్‌పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మ రోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ సాధించిన రికార్డులు ఇవే ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్లో పవర్‌ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు. చదవండి: May 29 2026 9:51 PM | Updated on May 29 2026 9:59 PM అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్లో పవర్‌ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు. చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం THE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷 🎥 The Boy Wonder playing fire with fire 🔥 Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP — IndianPremierLeague (@IPL) May 29, 2026 సిస్టమ్ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు) హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు) ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు) నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొట్టిన తెలంగాణ మహిళ! లాంచ్ ప్యాడ్ పైనే పేలిన బ్లూ-ఆరిజన్ రాకెట్ LC-36