
ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ ముందు కొండంత లక్ష్యం నిలిచింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అయితే, ఆఖర్లో డొనోవన్ ఫెరీరా సృష్టించిన విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరును నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా సూర్యవంశీ పరిణితి చెందిన ఆటతీరుతో ఆకట్టుకోగా, ఫెరీరా తన పవర్ హిట్టింగ్తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (1) ఔట్ కాగా, ఆ తర్వాత కగిసో రబాడా బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్ (7) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, ప్రమోషన్‌పై నాలుగో స్థానంలో