
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శ్రీకాకుళంలో ధర్నా చేస్తున్న ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి నాయకులు విద్యామంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి దగా డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు లోకేశ్‌కు ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం అంటూ మండిపాటు సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, May 30 2026 6:13 AM | Updated on May 30 2026 6:13 AM సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు. పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు .. ⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ⇒ బాపట్లలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ⇒ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు. ⇒ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని