
Singareni Employees: మందమర్రి, మే 29, ప్రభాతవార్త: మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి యూనియన్‌తో 18వ స్ట్రక్చర్ సమావేశం శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. Read Also: Retired Employees: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం వేదికగా నిలిచింది. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీతో పాటు ఇతర ఏఐటియుసి నాయకులు పాల్గొని ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం రెండూ పరస్పర ఆధారితమైనవని పేర్కొన్నారు.ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు ఉద్యోగుల భద్రత, సంక్షేమం, సౌకర్యాల పెంపుపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించి వాటి పురోగతిని అధికారులు వివరించారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలపై చర్చించి వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధిపతులకు జీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పని పరిస్థితులు, భద్రతా చర్యలు, మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జీఎం అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో కార్మికులు ఇప్పటివరకు చూపిన సహకారం ప్రశంసనీయమని జీఎం కొనియాడారు. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కార్మిక సంఘాల నాయకులను కోరారు. ఈ సమావేశంలో కె.కె గ్రూప్ ఏజెంట్ రాంబాబు, డీజీఎం పర్సనల్ అశోక్, డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్, డీజీఎం వర్క్‌షాప్ (ఈ అండ్ ఎం) దూప్ సింగ్, డీవైపీఎం సందీప్, సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఏఐటియుసి జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సి.వి. రమణతో పాటు ఇతర సీనియర్ అధికారులు, యూనియన్ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Governor Shiv Pratap Shukla:ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి! RR VS GT Scorecard: రాజస్థాన్‌పై గిల్ విధ్వంసం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం! Women Welfare Schemes : మహిళా సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు.. రామాయంపేటలో ఘన లోన్ మేళా Phone Exploded in Pocket : జేబులో పేలిన ఫోన్..!! Hydraa Eagle Team: హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన... ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి... మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, తాజాగా తనలోని సరికొత్త... ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (Gujarat Titans) కెప్టెన్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేని స్వచ్ఛమైన పట్టణాలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ... ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన... తెలంగాణలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న... కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)ను చాటుకుంటూ వేదాంత పవర్ అనుబంధ సంస్థ అయిన ‘మీనాక్షి ఎనర్జీ... తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మహానాడు 2026’ నిన్నటితో అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Singareni Employees: మందమర్రి, మే 29, ప్రభాతవార్త: మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి యూనియన్‌తో 18వ స్ట్రక్చర్ సమావేశం...