
Riyan Parag : రెండో సారి కప్పును సాధించాలన్న రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం నెరవేరలేదు. శుక్రవారం ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ తరువాత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ఇలాగే ఆడుతూ తమకు రెండో టైటిల్‌ను వైభవ్ సూర్యవంశీ అందిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్థశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (45; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డోనోవన్ ఫెరీరా (38నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో వికెట్ సాధించారు. Rishabh Pant : లక్నో కెప్టెన్సీకి రాజీనామా చేసిన రిషబ్ పంత్.. సోషల్ మీడియాలో ఫ్రాంఛైజీ కీలక ప్రకటన.. అనంతరం శుభ్‌మన్ గిల్ (104; 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. సాయి సుదర్శన్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై రాజస్థాన్ Telugu » Sports » Ipl 2026 Riyan Parag Comments After Rajasthan Royals Lost Match To Gujarat Titans In Qualifier 2 ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము 20 పరుగులు తక్కువగా చేశామని, ఒకవేళ ఆ పరుగులను సాధించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్నాడు. నిజం చెప్పాలంటే 215 పరుగులు కూడా కాపాడుకోదగిన స్కోరే అని అన్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ముందు హెవీ రోలర్ తో పిచ్ పై రోలింగ్ చేశారు. దీంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందన్నాడు. ఆరంభంలోనే ప్రత్యర్థి ఓపెనర్ల వికెట్లను తీయాలని భావించాము. అయితే.. అది సాధ్యపడలేదన్నాడు. దీంతో మ్యాచ్ తమ నుంచి చేజారిపోయిందన్నాడు. ఇక ఈ సీజన్లో తమకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. ఇది యువ ఆటగాళ్లతో నిండిన జట్టు.. వారికి అనుభవం కూడా లేదు. నిజం చెప్పాలంటే మేము అసలు ప్లేఆఫ్స్‌కు కూడా క్వాలిఫై అవుతామని అనుకోలేదు. అయితే.. ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. వచ్చే సీజన్లో బలంగా తిరిగి వస్తాం. అని పరాగ్ అన్నాడు. Hardik Pandya : ఐపీఎల్ నుంచి ఔట్.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఫ్రాన్స్‌కి వెకెషన్‌కు వెళ్లిన పాండ్యా! ఇక 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. అతడి గురించి చెప్పాలంటే తన దగ్గర మాటలు లేవన్నాడు. బంతిని బలంగా బాది పరుగులు చేయడం ఓ ఎత్తు అయితే.. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం మరో ఎత్తు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే ఎంతో పరిణితి చూపించాడు. అతడు గుడ్డిగా బాదేయడం లేదు. అతడు లెక్కలు వేసుకుని మరి ఆడుతున్నాడు. అతడు అది ఎలా చేస్తున్నాడో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. ఏదీఏమైనప్పటికి కూడా అతడు ఇలాగే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. మన దేశానికి ప్రాతినిధ్యం వహించి, టీమ్ఇండియాకు విజయాలను తెచ్చిపెడతాడని అనుకుంటున్నాను. అంతేకాకుండా అతడు భవిష్యత్తులోనూ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతూనే ఉండి తమని రెండో సారి ఛాంపియన్లుగా నిలబెడతాడని ఆశిస్తున్నాను అని పరాగ్ అన్నాడు. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Riyan Parag : రెండో సారి కప్పును సాధించాలన్న రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం నెరవేరలేదు. శుక్రవారం ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో...