
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను అలవోకగా చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ తలపడనుంది. వరుసగా రెండోసారి సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరడం గమనార్హం. దీనిపై కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు ప్రదర్శనపైనా మాట్లాడాడు. ‘‘టాస్ సమయంలో కాస్త అయోమయానికి గురయ్యాం. అందులో ఓడినా.. మ్యాచ్‌లో గెలవడం ఆనందంగా ఉంది. సాయి సుదర్శన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మేమిద్దరం ఆటను అర్థం చేసుకొనే విధానం ఒకేలా ఉంటుంది. ఏ బౌలర్‌ను ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లోనూ సాయి హిట్‌వికెట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశా. అందులో అతడి చేతులకు టేప్ వేసి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో నేనూ అదే చేయాలేమో (నవ్వుతూ)’’ అని గిల్ తెలిపాడు. ‘‘ఒక దశలో మేం వారిని 180 లేదా 190 పరుగులకే కట్టడి చేయాలని భావించాం. కానీ, 214 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో మాకు మంచి ఆరంభం దక్కింది. నేను చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నా. అలాగే జరిగింది. మాకు చాలా బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, వాటిని వినియోగించే అవసరం రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్ కూడా లోతైంది. ఫైనల్ మ్యాచ్ హోం గ్రౌండ్లో ఆడనుండటం మాకు కలిసొస్తుంది. అయితే, మరో గొప్ప జట్టుతో తలపడనున్నామనే విషయాన్ని మరువకూడదు. నాణ్యమైన క్రికెట్ ఆడితే విజయం ఆటోమేటిక్‌గా దరిచేరుతుంది’’ అని గిల్ వెల్లడించాడు. రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ (58) బ్రిజేశ్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత ‘నువ్వు అహ్మదాబాద్‌కు గ్లూ తీసుకెళ్లాలేమో’ అని సాయిని అడుగుతాడు. దానికి సమాధానం ఇస్తూ ‘‘అవును. నేను కూడా ఏదోక ప్రయత్నం చేయాలి. గత మ్యాచ్‌లో కనీసం స్టంప్స్‌ను తాకే ముందు బ్యాట్ బౌన్స్ అయింది. ఈసారి అలా జరగలేదు. శుభ్‌మన్ గిల్‌తో భాగస్వామ్యం ఎప్పుడూ బాగుంటుంది. లక్ష్య ఛేదనకు దిగినప్పుడు మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలిగాం’’ అని సాయి సుదర్శన్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను అలవోకగా చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో...