
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పోలీసు శాఖ నుంచి ఆర్థికశాఖకు చేరినట్లు సమాచారం. Also Read : Indiramma Illu : రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత వారికే.. క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ పోలీసుశాఖలో 19వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ముందుగా 5వేల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మిగిలిన 14వేల ఖాళీలను ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోలీసుశాఖలో ఇటీవల ప్రతి ఏడాది సుమారు 2వేల మందికిపైగా వివిధ హోదాల్లోని పోలీసులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం అధికమవుతోంది. ఈ క్రమంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి చేపట్టబోయే పోలీసు రిక్రూట్మెంట్ లో ఎంపికైన వారిలో అత్యధికులను దేశానికి సవాలుగా మారిన సైబర్ నేరాలు, మత్తు మందుల కట్టడికి సంబంధించిన విభాగాల్లో వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. Telugu » Telangana » Telangana Government Is Preparing To Fill 5000 Posts In Police Department 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5వేల...