"ఆ వయసులో మేము గోళీలు, గిల్లీదండ కూడా సరిగ్గా ఆడలేకపోయాం" అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ మ్యాచ్ అనంతరం అమితాబ్ బచ్చన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. ఈ వయసులో మేము గోళీలు, గిల్లీదండ కూడా సరిగ్గా ఆడలేకపోయాం!!" అని హిందీలో పోస్ట్ చేశారు. గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.అమితాబ్ వ్యాఖ్యలతో నెటిజన్లు ఏకీభవించారు. "రాజస్థాన్ ఓడిపోవడం మాట అటుంచితే, వైభవ్ మరో ఇన్నింగ్స్ చూడలేకపోతున్నామనేదే బాధ" అని ఒక అభిమాని పేర్కొనగా, "వైభవ్ ఆట వెనుక అతని తండ్రి త్యాగం, కృషి ఉన్నాయి" అని మరొకరు కామెంట్ చేశారు. మ్యాచ్ ఓటమి తర్వాత డగౌట్లో వైభవ్ కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఈ యువ సంచలనం ఐపీఎల్ 2026లో అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. "ఆ వయసులో మేము గోళీలు, గిల్లీదండ కూడా సరిగ్గా ఆడలేకపోయాం" అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్...