
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళనతో ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అమెరికాలో మెటా కంపెనీలో నాలుగేళ్లు పని చేసిన ఆశా ఈ మధ్య లేఆఫ్ అయింది. ఇలాంటి సమయంలో బాధపడాల్సింది పోయి ఆమె మాత్రం సంతోషంతో మనసులో మాట బయటపెట్టింది. పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నా ప్రతి రోజూ ఓకేలా జరిగే మీటింగ్స్ గంటల కొద్దీ కూర్చుని డాక్యుమెంట్లు తయారుచేయడం విసుగనిపించాయనీ తెలిపింది. బయటికి మంచి జీవితం కనిపించినా లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపింది. రొటీన్ వర్క్‌తో లోలోపల చనిపోయినట్లు ఫీలయ్యేదానినని ఆ బాధతో కుంగిపోయాననీ చెప్పుకొచ్చింది. ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన..క్రియేటివ్ పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది. ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలు బయటపడినట్లయింది. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటున్నారు. “డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో చర్చ నడుస్తోంది. మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy. పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం! Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!