
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్ప్రతి (Sir H. N. Reliance Foundation Hospital) అరుదైన ఘనతను సాధించింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన ఆల్ ఇండియా క్రిటికల్ కేర్ హాస్పిటల్ ర్యాంకింగ్ సర్వే-2026లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది తమకు అత్యంత గర్వించదగిన క్షణమని పేర్కొంటూ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ఇన్స్టాలో ఓ వీడియోని పోస్టు చేసింది. ఇది ప్రతి భారతీయుడికీ ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందుబాటులో ఉంచాలనే తమ సంస్థ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ గొప్ప సంకల్పం, నిబద్ధతకు దక్కిన గౌరవంగా పేర్కొంది. కేవలం క్రిటికల్ కేర్ మాత్రమే కాకుండా వైద్య రంగంలోని ప్రధాన స్పెషాలిటీల్లో కూడా తమ ఆసుపత్రి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కార్డియాక్ సైన్సెస్, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, అంకాలజీ, న్యూరోసైన్సెస్, ఎమర్జెన్సీ అండ్ట్రామా, అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, యూరాలజీ తదితర ప్రముఖ స్పెషాలటీల్లో సాధించిన అగ్రశ్రేణి ర్యాంకింగ్స్.. తమ ఆస్పత్రిలో వైద్య నిపుణత, అధునాతన సాంకేతికతకు నిదర్శనమని పేర్కొంది. ఈ అపూర్వ విజయానికి కారణమైన తమ ఆస్పత్రిలో పనిచేసే గొప్ప వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు తమపై విశ్వాసం ఉంచిన రోగులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపింది. అందరం కలిసి దేశమంతా వైద్య ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్ప్రతి (Sir H. N. Reliance Foundation Hospital) అరుదైన ఘనతను సాధించింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన ఆల్...