
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే, కొత్త చిత్రాలు ప్రకటిస్తున్నాడు. రష్మికను పెళ్లాడిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తాడనుకుంటే, మరింత వేగం పెంచాడు. మొన్నటికిమొన్న శౌర్యువ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన ఈ హీరో, తాజాగా విక్రమ్ కుమార్ తో సినిమా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి ‘రణబాలి’ కాగా, రెండోది ‘రౌడీ జనార్థన’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రణబాలి. 1854 నాటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అటు ‘రౌడీ జనార్థన’ షూటింగ్ కూడా సాగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్. ఈ రెండింటిలో ‘రణబాలి’ ఈ ఏడాదే విడుదల అవుతుంది. ఇక ‘రౌడీ జనార్ధన’ వచ్చే ఏడాది తొలి నెలల్లో రిలీజ్ అవుతుంది. అలాగే శౌర్యువ్ దర్శకత్వంలో ప్రకటించిన సినిమా షూటింగ్ ని కూడా త్వరలోనే మొదలుపెట్టి. ఈ సినిమాలతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ గతంలో పాన్ ఇండియా మోజులో పడి టైం వేస్ట్ చేసుకున్నాడు. దాంతో, మార్కెట్ పెరగలేదు. పైగా ఫ్లాపులు ఎక్కువ అయ్యాయి. అందుకే ఇప్పుడు స్పీడ్ పెంచి సక్సెస్ శాతం పెంచే విధంగా ప్రయత్నిస్తున్నాడు.