
దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఘాట్ దుస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరిగింది. యాంకర్ గౌతమి షేర్ చేసిన ఓ వీడియోలో ఘాట్ పరిసరాలు నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించడంతో సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన మనోజ్ మంచు (Manoj Manchu) వెంటనే స్పందించారు. దాసరి నారాయణరావు పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ, స్వయంగా ఘాట్‌ను సందర్శించి అక్కడి పరిసరాలను శుభ్రం చెయ్యించారు. మనోజ్, ఆయన బృందం పేరుకుపోయిన చెత్త, ఎండుటాకులు తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తన సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు ఉదయం 7 గంటలకే తన బృందంతో కలిసి ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “మూడు నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడటం బాధగా ఉంది. ఇటీవల వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత వెంటనే ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను” అన్నారు. మనోజ్, ఆయన భార్య మౌనిక కలిసి ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు, అనాథాశ్రమాల సందర్శనలు వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మనోజ్, ఇప్పుడు దాసరి ఘాట్ పునరుద్ధరణకు ముందుకొచ్చి మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఘాట్ దుస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరిగింది. యాంకర్ గౌతమి షేర్ చేసిన ఓ వీడియోలో ఘాట్ పరిసరాలు నిర్లక్ష్యానికి గురైనట్లు...