
Indrakeeladri Giri Pradakshina: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణకు భక్తులకు అనుమతి ఇచ్చారు. మే 31 ఉదయం 5.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. భక్తులందరూ పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో వి.కె.శీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సకల దేవతలు కొలువైన పవిత్ర క్షేత్రంగా ఇంద్రకీలాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పౌర్ణమి వేళ భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులు సమయానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అధికారుల సూచించారు. ”పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ నెల 31న ఉదయం 5.30 గంటలకు నిర్వహించనున్నాం. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ వల్ల సకల దేవతల అనుగ్రహం లభించి, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి” అని దేవస్థానం ఈవో శీనా నాయక్ పిలుపునిచ్చారు. Telugu » Astrology » Giri Pradakshina On Indrakeeladri On The Occasion Of Full Moon 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Indrakeeladri Giri Pradakshina: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణకు భక్తులకు అనుమతి ఇచ్చారు. మే 31 ఉదయం 5.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఘాట్...