
చెన్నై: సినీ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఆ స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని కథానాయకుడు రామ్‌చరణ్ (Ram Charan) అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. జూన్ 4న (peddi movie release date) పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. జాన్వీకపూర్ కథానాయిక. చిత్ర ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, నటుడు శివరాజ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడారు. ‘‘సీఎం జోసెఫ్ విజయ్ను చూసి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు. చెన్నై వచ్చినప్పుడల్లా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మా కుటుంబానికి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్లో పాల్గొన్నా. మా దర్శకుడు బుచ్చిబాబు (peddi movie director) అయితే.. ఐదారేళ్లు కష్టపడ్డాడు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. గత పది, పదిహేను రోజులుగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. శివన్న తెరపై కనిపిస్తే ఒక ఫైర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ‘జైలర్’లో ఆయన ప్రజెన్స్ గూస్బంప్స్ వచ్చేలా ఉంటుంది. కళ్లతోనే హావభావాలు, నటన పలికిస్తారు’’ ‘‘రోబో’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలకు రత్నవేలు పనిచేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన అనుభవం ఎంతో పనికొచ్చింది. దివ్యేందు (divyenndu in peddi), నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా యాటిట్యూడ్ ఆరున్నర అడుగుల పైనే ఉంటుంది. ఈ సినిమాను కష్టంతో కాదు, ఇష్టంతో చేశాం. ‘‘రోబో’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలకు రత్నవేలు పనిచేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన అనుభవం ఎంతో పనికొచ్చింది. దివ్యేందు (divyenndu in peddi), నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా యాటిట్యూడ్ ఆరున్నర అడుగుల పైనే ఉంటుంది. ఈ సినిమాను కష్టంతో కాదు, ఇష్టంతో చేశాం. ‘పెద్ది’ కోసం మూడు ఆటలు ఆడటమే కాదు, అందుకు తగినట్లు మారడం కష్టమే. కానీ, బుచ్చి స్క్రిప్ట్ డిమాండ్ అలాంటింది. ‘పెద్ది’ మూవీ ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది. ఇదొక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్. (peddi movie story) చిన్న సందేశం కూడా ఉంటుంది. ఇక మా హీరోయిన్ జాన్వీకపూర్ నిబద్ధత కలిగిన నటి. తల్లి వారసత్వాన్ని తప్పక కొనసాగిస్తుంది. తెలుగు వారిలాగానే తమిళ ప్రజలకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమా థియేటర్లు, హోటళ్లు అన్నీ ఎంతో క్లీన్ ఉంటాయి. అలాగే మా సినిమాను కూడా ఆదరించండి’’ అని రామ్‌చరణ్ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అగ్రకథానాయకుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.