రైతు డిస్కం ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ ను నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీచేయబోమని.. ఒకవేళ మీటర్లు బిగించకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ విసిరారు. దేశంలో తొలిసారి రైతు డిస్కం ఏర్పాటుచేశామని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ కోసమేనని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.అంతేకాదు, రైతు పండించే ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధరను నిర్ణయించిన కేంద్రం.. రైతు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అన్నారు. ‘రాష్ట్రం కొనుగోలుచేసిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, లేకుంటే బీజేపీ నేతల ఇళ్ల వద్ద నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హరీష్ రావు చెప్పిన ధరకే బియ్యం అమ్ముతామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. ‘‘రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం.. విద్యుత్ వినియోగాన్ని దీనికి అనుసంధానం చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుంది.. ఏడాదికి మేము రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్లు రుణాలు తీరుస్తున్నాం.. కానీ, మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్‌రావు మాట్లాడటం లేదు... రూ.54 వేల కోట్లు రుణం తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రుణాలు చేయడానికి అనుమతి లేదు’’ అని పేర్కొన్నారు.‘‘బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు చెప్పాలి. గతంలో వైఎస్సార్ దగ్గరికి హరీష్ వెళ్లారు. ఆయన ఎవరెవరితో రైతు డిస్కం ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ ను నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీచేయబోమని.. ఒకవేళ మీటర్లు బిగించకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ విసిరారు. దేశంలో తొలిసారి రైతు డిస్కం ఏర్పాటుచేశామని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ కోసమేనని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.అంతేకాదు, రైతు పండించే ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధరను నిర్ణయించిన కేంద్రం.. రైతు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అన్నారు. ‘రాష్ట్రం కొనుగోలుచేసిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, లేకుంటే బీజేపీ నేతల ఇళ్ల వద్ద నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హరీష్ రావు చెప్పిన ధరకే బియ్యం అమ్ముతామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. ‘‘రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం.. విద్యుత్ వినియోగాన్ని దీనికి అనుసంధానం చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుంది.. ఏడాదికి మేము రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్లు రుణాలు తీరుస్తున్నాం.. కానీ, మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్‌రావు మాట్లాడటం లేదు... రూ.54 వేల కోట్లు రుణం తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రుణాలు చేయడానికి అనుమతి లేదు’’ అని పేర్కొన్నారు.‘‘బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు చెప్పాలి. గతంలో వైఎస్సార్ దగ్గరికి హరీష్ వెళ్లారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారో.. నాకు తెలుసు.. కానీ చెప్పను.. పార్టీ మీటింగ్ వదిలేసి ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తాయనడంలో ఎటువంటి అనుమానమే లేదు’’ అని అన్నారు. సీబీఎస్ఈలో ప్రశ్నాపత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా.. కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు అబద్దాల పునాదులపై రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2034 వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలకు మేలు చేయాలనేది తన ఉద్దేశమని అన్నారు. 2029 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని, తమది విజయవంతమైన జోడీ అని జోస్యం చెప్పారు.అంతర్రాష్ట్ర జల వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెబుతున్నారని, కానీ తుమ్మిడి హట్టిపై మాట్లాడేందుకు మహారాష్ట్ర సీఎం సమయం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు డిస్కం ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్...