
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nenevaru Runnig Successfully: ఈ వారం రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో విడుదలైన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?” . మే 29న వరల్డ్ వైడ్‌గా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుక్రవారం విడుదలైన సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతూ దూసుకుపోతుంది. అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శితమవుతోందని వారు తెలిపారు. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందన్నారు. మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. “నేనెవరు?” చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. అలాగే సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారన్నారు. సినిమాలోని భావోద్వేగాలు, అలాగే సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారన్నారు. సినిమాలోని భావోద్వేగాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్స్ సంఖ్య కూడా పెంచినట్టు తెలిపారు. డైరెక్టర్ చిరంజీవి తన్నీరు రూపొందించిన కథనం, చిన్నికృష్ణ అందించిన సంగీతం, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి - తారకరామారావు ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. శ్రీనివాస్ మాటలు, ఎస్.ఎస్. వీరు రాసిన పాటలు చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయని నిర్మాతలు తెలిపారు. “సినిమా చాలా బాగుంది” అందరు ఫ్యామిలీస్‌తో వచ్చిన మా సినిమా చూస్తున్నట్టు తెలిపారు. “మంచి సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రం అన్నారు. “ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం” అంటూ ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకుల ఆదరణతో “నేనెవరు?” విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరిన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శనకు డిమాండ్ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. Also Read: Jr NTR Top Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే.. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్టర్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన...