
వయసు మీరుతోందనో లేదంటే ఇంట్లో అమ్మానాన్నలు ఒత్తిడి తీసుకొస్తున్నారనో.. ఇలా కారణమేదైనా తాము మానసికంగా సిద్ధపడకముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు కొందరమ్మాయిలు. తీరా పెళ్లయ్యాక శారీరక వేధింపులు మొదలు గృహ హింస దాకా.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వయసు మీరుతోందనో లేదంటే ఇంట్లో అమ్మానాన్నలు ఒత్తిడి తీసుకొస్తున్నారనో.. ఇలా కారణమేదైనా తాము మానసికంగా సిద్ధపడకముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు కొందరమ్మాయిలు. తీరా పెళ్లయ్యాక శారీరక వేధింపులు మొదలు గృహ హింస దాకా.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిని తట్టుకోలేక కొంతమంది జీవితం అగమ్యగోచరంగా మారుతుంటుంది. ఈ సమస్యల్లేకుండా ఉండాలంటే పెళ్లికి ముందే అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం సాధించడం ముఖ్యమంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే ముందు నుంచే ఆయా ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టడం ముఖ్యమంటూ ఇన్‌స్టా వేదికగా కొన్ని చిట్కాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ఎంతోమంది అమ్మాయిల్ని ఆలోచనలో పడేసింది. ఏ అమ్మాయైనా కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ కొంతమంది విషయంలో ఇది కుదరకపోవచ్చు. వయసు దాటిపోతోందని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడం, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఇలాంటి కారణాల వల్ల కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. కానీ వివాహమయ్యాక ఆయా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలన్నా, ప్రతి దానికీ భర్తపై ఆధారపడకుండా ఉండాలన్నా.. పెళ్లికి ముందే అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం సాధించడం తప్పనిసరి అంటున్నారు రుజుత. ముఖ్యంగా ఈ మూడు విషయాల్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు నుంచే ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం చూస్తున్నాం. అయితే అందరికీ తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకచ్చు.. దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరక్కపోయినా తమ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు నుంచే ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం చూస్తున్నాం. అయితే అందరికీ తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకచ్చు.. దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరక్కపోయినా తమ నైపుణ్యాలకు తగినట్లుగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి.. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించమంటున్నారు రుజుత. ‘పెళ్లయ్యాక భర్త, అత్తింటి వారి సంపాదనపై ఆధారపడే మహిళలకు తగిన గుర్తింపు దక్కకపోవచ్చు.. అలాగే ప్రతిదానికీ సర్దుకుపోవాల్సి రావచ్చు. ఇలా ప్రతి విషయానికీ మనసు చంపుకొనే బదులు.. ముందు నుంచే ఉద్యోగం చేస్తే పెళ్లయ్యాకా అమ్మాయిలు తమకు నచ్చినట్లుగా జీవితం కొనసాగించచ్చు. మీకంటూ సంపాదన ఉంటే ఆటోమేటిక్‌గా అత్తింట్లో మీ గౌరవం పెరుగుతుంది.. మీ నిర్ణయాలకు తగిన గుర్తింపు దక్కుతుంది.. బలవంతంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ సాధించాకే పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అలాగని ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాకే వివాహం చేసుకుంటామని మొండి పట్టు పట్టి కూర్చోవడం కూడా సరికాదు.. మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగం సంపాదించి.. ఏదైనా చేయగలుగుతానన్న ఆత్మవిశ్వాసం సొంతమయ్యాకే అడుగు ముందుకేయడం మంచిది..’ అంటారామె. వివాహం తర్వాత ఉద్యోగం చేయాలా? వద్దా? అనేది కాబోయే దంపతులిద్దరి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ముందే ఈ విషయంలో ఓ నిర్ణయానికొస్తే.. తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. అందుకే ఇలాంటి సమయంలో భర్త, అత్తింటి వారిపై ఆధారపడకుండా.. ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు కనీసం మూడేళ్ల బ్యాంక్ బ్యాలన్స్ ఉండేలా జాగ్రత్తపడడం తప్పనిసరి అంటున్నారు రుజుత. ‘ఊరు మారడం, కుటుంబ బాధ్యతలు, పిల్లలు పుట్టడం.. ఇలా వివిధ కారణాల వల్ల కొందరు మహిళలు పెళ్లయ్యాక ఉద్యోగం మానేయాల్సి రావచ్చు. నిజానికి ఇలా సడన్‌గా జాబ్ మానేసినా.. ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలా జరగకుండా ఉండాలంటే.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే కనీసం మూడేళ్లకు సరిపడా డబ్బు పొదుపు చేసుకోవాలి. ఇవి మీకు ఆర్థిక భరోసాను ఇవ్వడంతో పాటు.. మీ కనీస అవసరాలు తీర్చుతాయి.. అలాగే అత్యవసర పరిస్థితుల్నీ నిర్భయంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు.. మీ బాధ్యతలు తీరిపోయాక, పిల్లలు పెద్దవారయ్యాక తిరిగి కెరీర్ ప్రారంభించాలనుకున్నా.. ఈ డబ్బుతో మీకు కావాల్సిన కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఒకవేళ అనుబంధంలోనే కలతలొచ్చి విడిపోవాల్సి వచ్చినా.. తదనంతరం ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.. ఇలా పొదుపు మనకు ఒక రకమైన ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది..’ అంటూ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు తాము పొదుపు చేసిన డబ్బుతో పిల్లల పెళ్లి చేయడం సర్వసాధారణమే! ఈ క్రమంలో ఏళ్లకేళ్లు కష్టపడి పొదుపు చేసిన లక్షల కొద్దీ డబ్బును ఈ ఒక్క రోజున ఖర్చు చేసేస్తుంటారు. అయితే ఈ అనవసర ఖర్చు తగ్గించుకోమంటున్నారు రుజుత. ఈ విషయంలో కూడా పేరెంట్స్‌పై ఆధారపడకుండా.. సొంతంగా పొదుపు చేసుకోమని అమ్మాయిలకు సూచిస్తున్నారు. ‘పెళ్లికి ఒక కచ్చితమైన బడ్జెట్ పెట్టుకోవడం ముఖ్యం. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ మూడు నెలల జీతాన్ని పక్కన పెట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తద్వారా ఖర్చులన్నీ ఈ బడ్జెట్‌కు అనుగుణంగానే పెట్టాలన్న ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చినప్పుడు.. తమ పెళ్లికి ఏది అవసరం? ఏది