
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ నిలిపేస్తుందని, మోటార్లకు మీటర్లు బిగిస్తుందని విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాల్లో తాను విఫలమైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ విఫలమైతే ఎన్నికలకు దూరంగా ఉంటుందా అని రేవంత్ సవాల్ విసిరారు. రైతుల ముసుగులో రాజకీయ లబ్దికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇచ్చేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని, ఉచిత విద్యుత్ ను దీనికి అనుసంధానం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు డిస్కం ఏర్పాటు వల్ల ఉచిత విద్యుత్ పై జవాబుదారీతనం పెరుగుతుందని రేవంత్ చెప్పుకొచ్చారు. అప్పులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తాము ఏడాదికి 70 వేల కోట్లు అప్పులు చేస్తుంటే.. 95 వేల కోట్లు తీరుస్తున్నామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. ఆయన కేసీఆర్ మీద ఒట్టేసి బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పాలని రేవంత్ సూచించారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని, కానీ చెప్పనని తెలిపారు. తాజాగా పార్టీ మీటింగ్ వదిలేసి ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనడంలో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. 2034 వరకూ తాను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానని, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ దీ, తనదీ విజయవంతమైన కాంబినేషన్ అని రేవంత్ చెప్పుకొచ్చారు. తాము ఇప్పటికే అన్ని ఎన్నికలూ గెలిచామని, భవిష్యత్తులోనూ గెలుస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ నిలిపేస్తుందని, మోటార్లకు మీటర్లు బిగిస్తుందని విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)...