
పశ్చిమ్ బెంగాల్ లో షాకింగ్ ఘటన జరిగింది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాకాండలో బాధిత కార్మిక కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దొంగ దొంగ అంటూ నినాదాలు చేస్తూ చొక్కా చింపి.. కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షణకోసం హెల్మెట్ ధరించినా దాన్ని తీసేసి దాడికి పాల్పడ్డారు దుండగులు. అభిషేక్ బెనర్జీ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని సోనార్ పూర్ లో పర్యటించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం ప్రజలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని.. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని.. రోడ్లు వేయలేదని.. డబ్బంతా దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆగ్రహంతో ఉన్నామని ప్రజలు తెలిపారు. మరోవైపు తనపై జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం కారణం అని ఎంపీ అభిషేక్ బెనర్జీ కీలక ఆరోపణలు చేశారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని.. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు లేరని అన్నారు. ఇది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ఈ ఘటన మొత్తం స్థానికంగా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిందని.. ఈ ఘటనపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. అలాగే గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం.. మేమే దాడి చేశామని.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. ఇక సోనార్ పూర్ లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై #WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was attacked during his visit to Sonarpur to meet the post-poll violence victims' families He says, "It's all BJP-sponsored. Look what they have done. This is their example of democracy. It hasn't even been a month,… pic.twitter.com/UXM9dzsb4U ఇక సోనార్ పూర్ లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడిని బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈ మేరకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులే హంతకులుగా మారారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు బీజేపీకు సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు. పశ్చిమ్ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పశ్చిమ్ బెంగాల్ లో షాకింగ్ ఘటన జరిగింది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ...