
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్‌కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది. Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్‌లతోపాటు వారికి బ్యాగ్‌లు, లంచ్‌బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి. స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు బ్రాండెడ్ లాంగ్బుక్, నోట్ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది. పెన్నులు ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు రూ.139 నుంచి లంచ్ బ్యాగ్‌లు రూ.49కు పెన్సిల్ పర్సులు పిడిలైట్ గ్లూ ఎంఆర్పీపై కనీసం 15 శాతం స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు బ్రాండెడ్ లాంగ్బుక్, నోట్ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది. పెన్నులు ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు రూ.139 నుంచి లంచ్ బ్యాగ్‌లు రూ.49కు పెన్సిల్ పర్సులు పిడిలైట్ గ్లూ ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు Also Read: Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది డ్రాయింగ్ ఉపకరణాల ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు 12 ఫోల్డర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఎంఆర్పీ రూ.250 కన్నా రూ.179 మాత్రమే. బుక్ లేబుల్ స్టిక్కర్ రూ.19 ధరకు. 38 సెం.మీ బ్రౌన్ బుక్ కవర్ ఎంఆర్పీ రూ.70 కాస్త రూ.55 మాత్రమే. రూ.400 ధర కలిగిన కాలిక్యులేటర్ రూ.219 మాత్రమే. అన్ని రకాల కంగారూ ఉత్పత్తులపై 15 శాతం తగ్గింపు. రూ.49 నుంచి కత్తెర అప్సర ఎరేజర్, షార్ప్‌నర్ ఎంఆర్పీపై 20 శాతం తగ్గింపు. రూ.290 ధర కలిగిన ఎగ్జిక్యూటివ్ ఫోల్డర్ 12 పాకెట్ ఫైల్ రూ.199 మాత్రమే రూ.375 ధర కలిగిన జేకే కాపియర్ పేపర్ ఏ4 (21 సెం.మీ * 29.7 సెం.మీ), 70 జీఎస్ఎమ్ 500 షీట్లు రూ.275 ధరకే అందుబాటులో ఉంది. మెటల్ అండ్ మాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్ రూ.99 నుంచి ప్రారంభం. స్టడీ టేబుల్ రూ.349 నుంచి ప్రారంభం. బ్యాగ్‌లు, లంచ్బాక్స్పై ఆఫర్లు లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ కాంబో రూ.169తో ప్రారంభం. లంచ్ బాక్స్ రూ.45 నుంచి ప్రారంభం. స్కూల్ బ్యాగ్‌లు రూ.199 నుంచి ప్రారంభం. రూ.399 ధర కలిగిన స్టీల్ ప్లెక్సీ 2 లేయర్ లంచ్ బాక్స్ రూ.99 మాత్రమే లభిస్తోంది. గొడుగు రూ.329 నుంచి, వర్షపు కోటు (రెయిన్ కోట్) రూ.149 లభిస్తోంది. పాలిమర్ క్రికెట్ బ్యాట్ రూ.229, స్కూల్ షూస్ రూ.179 నుంచి ప్రారంభం. Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్‌కు నిరాశ రోజువారీ అవసరాలు, కిరాణ సామగ్రి 750 గ్రాములు కలిగిన రూ.415 ఉన్న బూస్ట్ రీఫిల్ ప్యాక్ రూ.335కు డీమార్ట్ అందిస్తోంది. డాబర్ హనీ స్క్వీజీ ప్యాక్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 గ్రాముల రూ.420 ధర కలిగిన హనీ రూ.255కు లభిస్తోంది. సన్‌ఫీస్ట్ యిప్పీ మ్యాజిక్ మసాలా న్యూడిల్స్ రూ.120 ఉండగా రూ.77కు మాత్రమే డీమార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ.280 ధర ఉన్న కిసాన్ మిక్స్ ఫ్రూట్ జామ్ (700 గ్రాములు) రూ.215కు డీమార్ట్ అందిస్తోంది. రూ.225 ధర కలిగిన నుటెల్లా ఫెర్రెరో (180 గ్రాములు) రూ.190 మాత్రమే లభిస్తోంది. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు...