
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Gen Z Girls : నల్లమల మూవీ దర్శకుడు రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవ సినిమా ‘ నవాబ్’. ఈ సినిమా తుది దశకు చేరుకుంటున్న తరుణంలో తాజాగా మూడో సినిమా ‘జెన్ జి గర్ల్స్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. రవిచరణ్ విషయానికొస్తే.. సాదాసీదా కథలతో కాకుండా.. కొత్త అభిరుచి గల డైరెక్టర్. తన దర్శకత్వ శైలి కూడా సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉండేలా తన సినిమాలను తెరకెక్కిస్తున్ారు. అందుకు తాజా ఉదాహరణ ‘నల్లమల’ మూవీ సాధించిన సక్సెస్. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇపుడు ‘నవాబ్’ అంటూ సినిమా చేస్తున్నారు. రవిచరణ్ ఏదైనా సబ్జెక్టును టేకప్ చేసాడంటే స్ట్రాంగ్ విజన్ తో సినిమా రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు. వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం ఆయన శైలి. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఉండేలా పాత్రల రూపకల్పన చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో కూడిన సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుత నేటి క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో కూడిన సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుత నేటి సమాజం లో ప్రతి రోజు మనకి తారసపడే పాత్రలతో రెండు సినిమాలు ఉండనున్నాయి. ఒకటి సమాజాన్ని ప్రభావితం చేసే ‘నవాబ్’ మూవీ రెండవది జూన్ నుంచి షూట్ స్టార్ట్ కాబోతున్న ‘జెన్ జి గర్ల్స్’. ఈ రెండు మూవీస్ దేనికవే డిఫరెంట్ అని చెప్పాలి. బలమైన భిన్నమైన కథలతో రవిచరణ్ సమాజం మీద తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డైరెక్షన్లో రూపొందిన ‘నవాబ్’ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టులో విడుదలకు రెడీ అవుతుంది. ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జెన్ జి గర్ల్స్’ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. Also Read: Jr NTR Top Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే.. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్టర్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన...