
AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన డీఎస్సీ (AP DSC) ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వస్తున్న అన్ని రకాల అపోహలు, ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతతో జరిగిందని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఎగ్జామ్స్ నిర్వహణ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన వరకు డిపార్ట్మెంట్ అనుసరించిన విధివిధానాలను పాయింట్ల వారీగా వివరించారు. ఈసారి డీఎస్సీ పరీక్షలను దేశంలోనే అత్యంత నమ్మకమైన ‘టీసీఎస్ ఐయాన్’ ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించినట్లు కోన శశిధర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ మరియు వివిధ రాష్ట్రాల హైకోర్టు పరీక్షలను ఇదే వేదిక ద్వారా నిర్వహిస్తారని ఆయన గుర్తుచేశారు. Read also: Pawan Kalyan: జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన ఈ ఆన్లైన్ విధానంలో ప్రశ్నపత్రాలు 256-బిట్ ఎన్క్రిప్షన్ (Encrypted) పద్ధతిలో నేరుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటాయి. అలాగే ప్రతి అభ్యర్థికి ప్రశ్నలు జంబుల్డ్ (మార్పిడి) పద్ధతిలో వస్తాయి. కాబట్టి ఇందులో ఎలాంటి హ్యూమన్ మానిపులేషన్‌కు (మానవ ప్రమేయానికి) ఆస్కారమే ఉండదు. పాత పద్ధతిలో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ లాంటి లోపాలకు తావులేకుండా ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా, పటిష్టంగా సాగిందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కలిపి మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ప్రభుత్వ మరియు టీసీఎస్ నిపుణుల బృందాలు అన్ని మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కలిపి మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ప్రభుత్వ మరియు టీసీఎస్ నిపుణుల బృందాలు అన్ని మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఈ సెంటర్లను ఖరారు చేశాయన్నారు. మార్చి 6 నుండి ఏప్రిల్ 2 వరకు సుమారు 24 రోజుల పాటు మొత్తం 89 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాల నిఘా ఉంచడంతో పాటు, ప్రభుత్వ అధికారులు మరియు టీసీఎస్ ఇన్విజిలేటర్లతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రిజల్ట్స్ విడుదలపై వస్తున్న పుకార్లను కోన శశిధర్ తీవ్రంగా ఖండించారు. పరీక్షలు ముగిసిన వెంటనే మే 5న ప్రాథమిక కీ (Initial Key) విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించామని, వాటిని పరిశీలించిన తర్వాత జూన్ 1న ఫైనల్ కీ ఇచ్చామని చెప్పారు. వేర్వేరు సెషన్లలో ఎగ్జామ్స్ జరగడం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు శాస్త్రీయమైన ‘నార్మలైజేషన్’ (Normalization) విధానాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. జూన్ 11న డీఎస్సీ స్కోర్లను, జూన్ 22న టెట్-డీఎస్సీ కలిపిన మెరిట్ లిస్ట్‌లను జిల్లాల వారీగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ లిస్ట్‌లను వెబ్సైట్ నుంచి తొలగించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అవి ఇప్పటికీ అందరికీ అందుబాటులోనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. మొదట్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, నిరుద్యోగుల అభ్యర్థన మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించేలా నిబంధనలను సడలించినట్లు శశిధర్ పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. మొత్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ బృహత్తర ఏపీ డీఎస్సీ ప్రక్రియలో ప్రతి అడుగు చట్టబద్ధంగా, అభ్యర్థుల హితాన్ని కోరి అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పునరుద్ఘాటించారు. Smoking: స్మోకింగ్ కేవలం ఊపిరితిత్తులకే హాని చేస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Tirumala Donation: తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం Vizag Steel Plant: విశాఖ ఉక్కులో ‘టిఒఎంసి’ విధానం: ప్రైవేటీకరణ దిశగా అడుగులు? Nitin Meets Tdp MLA: టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన హీరో నితిన్ AP Heat stroke deaths: వడదెబ్బకు ఇద్దరు కార్మికులు మృతి! Pawan Kalyan: పోలవరంలో పులి కలకలం.. అటవీ శాఖకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు! రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)... తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల... తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం