
Actress:బాలీవుడ్ నటి, మంచు విష్ణుతో కలిసి నటించిన సెలినా జైట్లీ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా ఆమె, మాజీ భర్త పీటర్ హాగ్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రియాలో కోర్టు విచారణ కొనసాగుతున్న సమయంలోనే సెలినాకు మాజీ భర్త పీటర్ హాగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి లీగల్ నోటీసులు అందినట్లు సమాచారం. సెలినా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల్లో తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని పీటర్ హాగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు పిల్లలపై కూడా దీని ప్రభావం పడుతోందని వారు పేర్కొన్నట్లు సమాచారం. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించకుండా గోప్యంగా ఉంచాలని, మీడియా ముందు వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వివాదానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. సెలినా జైట్లీ 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఏడాది తనపై గృహహింస జరిగిందంటూ సెలినా ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మాజీ భర్త కుటుంబం నుంచి లీగల్ నోటీసులు వచ్చాయనే వార్తలతో ఈ వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు మాజీ భర్త కుటుంబం నుంచి లీగల్ నోటీసులు వచ్చాయనే వార్తలతో ఈ వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. Actress:బాలీవుడ్ నటి, మంచు విష్ణుతో కలిసి నటించిన సెలినా జైట్లీ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా ఆమె, మాజీ భర్త పీటర్ హాగ్ మధ్య కొనసాగుతున్న వివాదం...