
గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. బంగారం అడిగి తీసుకొని తిరుపతమ్మ తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరుపతమ్మను పోలీసులు విచారణకు పిలిచారు. అపార్ట్మెంట్లోని మహిళ తనకు బంగారం ఇచ్చానని తప్పుడు ఫిర్యాదు చేసిందని, స్టేషన్కు పిలిపించి పోలీసుల వేధిస్తున్నారంటూ శనివారం సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending