
‘‘ఈ లెనిన్ గాడు నిప్పు’’ అంటున్నారు కథానాయకుడు అక్కినేని అఖిల్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ ‘లెనిన్’ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ‘‘ఈ లెనిన్ గాడు నిప్పు’’ అంటున్నారు కథానాయకుడు అక్కినేని అఖిల్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ ‘లెనిన్’ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. శివాజీ కీలక పాత్ర పోషించారు. నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి శనివారానికి 40ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘‘మనోడు వస్తున్నాడు’’ అంటూ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇది చిత్తూరు నేపథ్యంగా సాగే యాక్షన్ ప్రేమకథతో ముస్తాబైంది. కానీ, టీజర్ ప్రధానంగా నాయకానాయికల ప్రేమకథ చుట్టూనే తిరిగింది. భాగ్యశ్రీ స్టేజ్ ఆర్టిస్ట్‌లా పౌరాణికం గెటప్పులో ‘దాన వీర శూర కర్ణ’ డైలాగ్ చెప్పడం.. హీరో ఆమె వెంట పడటం.. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ప్రయాణాన్ని ఈ ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. ఆఖర్లో ‘‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందర్నీ వెతుక్కుంటూ వచ్చిన’’ అనే డైలాగ్‌తో అఖిల్‌ని యాక్షన్ కోణంలో చూపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending