
May 23 2026 7:55 PM | Updated on May 23 2026 7:55 PM జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత పూర్తిగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చాడు. అయితే చిన్నతనంలోనే తన శరీరం గురించి ఆలోచిస్తూ తారక్ మదనపడేవాడని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెప్పారు. ఎన్టీఆర్ చిన్నతనంలో జరిగిన సంఘటనలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) 'జూ.ఎన్టీఆర్‌కి నేనంటే ఇష్టం. చిన్నప్పుడే యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోవాలనుకున్నాడు. దీని గురించే వాళ్ల అమ్మ కూడా నన్ను అడిగారు. 'వద్దమ్మా.. మీ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలు చేయించండి బాగా చేస్తాడు' అన్నాను. 'అంకుల్ నేను లావుగా ఉన్నానా? జనాలు చూస్తారా?' అని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. దీంతో బాబు నువ్వు మీ తాత లాగా బ్రహ్మాండంగా ఉంటావు. నువ్వేం భయపడక్కకర్లేదు అని అన్నాడు' అని పోసాని చెప్పుకొచ్చారు. 'డైరెక్టర్ ఉదయ్ కుమార్‌తో అప్పట్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. దీనికి నన్ను డైలాగ్స్ రాయమని అడిగాడు. అప్పట్లో రైటర్‌గా బిజీగా ఉండేవాడిని కథ వినమని చెబితే వెళ్లి విన్నాను. 'మీకు స్టోరీ నచ్చిందా బాబు' అని తారక్‌ని అడిగాను. నచ్చిందని చెప్పాడు. నేను మాత్రం నాకు నచ్చలేదు. కథ బాగోలేదు బాబు అని డైరెక్టర్ అక్కడున్నప్పుడే ఎన్టీఆర్‌కి చెప్పా. స్టోరీ లైన్ నచ్చకపోయినా నువ్వు డైలాగ్స్ రాయమంటే రాస్తాను. ఆలోచించుకో బాబు అని అన్నాను. మీరు వద్దు అన్న తర్వాత ఇంకెందుకు అని ఆ స్టోరీని పక్కనబెట్టేశాడు. ఎన్టీఆర్ నన్ను అంతలా నమ్మాడు. అలా ఉదయ్ కుమార్‌తో కాకుండా రాజమౌళితో 'సింహాద్రి' చేశాడు. తర్వాత ఎక్కడికో వెళ్లిపోయాడు' అని పోసాని అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. తర్వాత కాలంలో నటుడిగా మారారు. ఎన్టీఆర్ 'టెంపర్' మూవీలో ఈయన చేసిన నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో 'మీరు మారిపోయారు సర్' అని పోసాని చెప్పే డైలాగ్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోసాని లీడ్ రోల్ చేస్తూ దర్శకనిర్మాతగా 'ఆపరేషన్ అరుణారెడ్డి' తీశారు. దీని ప్రమోషన్లలో భాగంగానే ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాల్ని పంచుకున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం) కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న హనుమాన్ విగ్రహం (ఫొటోలు) బికినీ ట్రీట్‌లో నిజమెంత?.. ట్రెండింగ్‌లో రుక్మిణి వసంత్ (ఫొటోలు) స్టైలిష్ అవతార్‌లో సీఎం విజయ్.. ఉప్పొంగిన అభిమానం (చిత్రాలు) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ : నీలిరంగు గౌనులో దేవకన్యలా ఐశ్వర్యా రాయ్ (ఫొటోలు) రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ చెడిపోయిందా ? టెన్షన్ వద్దు.. నేనున్నాగా.. కోచ్ కే ధైర్యం చెప్పిన బుడ్డోడు విజయ్ ను చూసి నేర్చుకో... ఇంకెంతకాలం డబ్బా మాటలు చెప్తావ్? ఎవడబ్బ సొమ్మని ఇల్లు కట్టుకున్నావ్..? అది రైతుల భూమి!
Summary status: pending