
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దళిత May 30 2026 10:40 PM | Updated on May 30 2026 10:40 PM న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు శనివారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, ఎంపీలు డాక్టర్ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఏమన్నారంటే..వారి మాటల్లోనే దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి వైఎస్సార్సీపీఅధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్‌ను కోరాం. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైఎస్సార్సీపీచిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావు దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం