
May 24 2026 10:49 AM | Updated on May 24 2026 10:51 AM న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5 రామ్చరణ్ 'పెద్ది కీ ఆవాజ్' ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు) భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు) కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న హనుమాన్ విగ్రహం (ఫొటోలు) బికినీ ట్రీట్లో నిజమెంత?.. ట్రెండింగ్లో రుక్మిణి వసంత్ (ఫొటోలు) రామ భక్తునివి కాదు.. బ్యాంక్ దొంగవి.. బ్యాంక్ డబ్బుతో బాగా ఒళ్ళు బలిసి.. జడ శ్రవణ్ సెటైర్లు దేవుడు అందరికీ సమానమే.. నాగబాబు వస్తే మమ్మల్ని బయటకు గెంటేస్తారా.. ప్రశ్నిస్తే చంపేస్తారా..! నాగేశ్వరరావుకు నేను ఉన్నా! రెచ్చిపోయిన పొన్నూరు CI.. YSRCP నేత అశోక్ బాబుని ఎత్తుకెళ్ళి చంద్రబాబు గుట్టు రట్టు.. తల్లి, చెల్లి, బాబాయ్ ఇదే ఆయుధం.. జగన్ క్యారెక్టర్ అసాసినేషన్
Summary status: pending