
Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి.. పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక, Telugu » Andhrapradesh » Gossip Garage Pawan Kalyan 4 Week Deadline For Mla Chirri Balaraju చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక, రాజకీయ చిక్కులే కాదు.. కుటుంబం నుంచి అంతకు మించిన తలపోటు ఉందనే చర్చ నడుస్తోంది. ఆయనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు..జనసేన ప్రతిష్టను మసకబారుస్తున్నాయని.. సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పవన్ కల్యాణ్‌తో భేటీలో ఫ్యామిలీ మేటర్ చుట్టూ కూడా గట్టిగానే చర్చకు జరిగిందని తెలుస్తోంది. వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలతో.. పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని.. ఆ గొడవలను 4 వారాల్లోగా పూర్తిగా చక్కదిద్దుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారట. ఇక అటు ఎమ్మెల్యే బాలరాజును టార్గెట్ చేస్తూ అధిష్టానానికి రోజుకో ఫిర్యాదు వెళ్తోందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులను.. బాలరాజు పక్కన పెట్టేశారట. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు.. ఎమ్మెల్యే వైఫల్యాలను, ఆరోపణలను ఎప్పటికప్పుడు సాక్ష్యాలతో సహా పార్టీ హెడ్ ఆఫీస్‌కు చేరవేస్తున్నారట. దీంతో పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. వైఫల్యాలు, వ్యక్తిగత వ్యవహారాలే కాదు..కేడర్‌ను కూడా కలుపుకుపోవాలని వార్నింగ్ ఇస్తూ.. పవన్ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించారట. త్వరలో ఏపీలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయ్. పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ సీట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాలని కూటమి పార్టీలు టార్గెట్ పెట్టుకున్నాయ్. దీంతో పార్టీకి తన మార్క్ రిపేర్లు చేస్తున్నారు పవన్. కేడర్‌ను కూల్ చేయడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ఏ చిన్న పొరపాటు కూడా కనిపించకూడదు అనుకునేలా.. బాలరాజుకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయ్. సేనాని ఇచ్చిన 4వారాల డెడ్‌లైన్‌లోగా.. ఫ్యామిలీ సమస్యలను సెటిల్ చేసుకుని, అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టించి.. కేడర్‌ను యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత బాలరాజుదే! ఇదే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద సవాల్‌గా మారే చాన్స్ ఉంది. మరి బాలరాజు ఏం చేస్తారు.. ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. 4 వారాల్లో అంతా సెట్‌రైట్ చేసుకొని తనను తాను ప్రూవ్ చేసుకుంటారా అనే చర్చ.. పోలవరంలో హాట్‌టాపిక్‌గా మారింది. Also Read: తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్? జూన్ 2న చేయబోయే ప్రకటనపై తీవ్ర ఆసక్తి.. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న...