
Mahila Shakti Super Markets; మహబూబ్‌నగర్, మే 30: మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ప్రతి నియోజకవర్గంలో “మహిళా శక్తి సూపర్ మార్కెట్లు” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు. మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. Mahila Shakti Super Markets: ఈ కార్యక్రమంలో Mahila Shakti Super Markets: ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా (MUDA) చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Komuravelli house burglary:కొమురవెల్లిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Mahalaxmi Smart Card Telangana:మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం! Collector K Haritha:మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి! Bandaru Dattatreya:బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ! Addanki Dayakar: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ Balmoori Venkat: బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన డిమాండ్ అమెరికాలో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన ఒక భారతీయ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం పదేళ్ల కఠిన... తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి... సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు... ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్... లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రజలకు, రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోవడంపై... కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వినూత్నమైన కథాంశాలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.... ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త... బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం... ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో... 2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Mahila Shakti Super Markets; మహబూబ్‌నగర్, మే 30: మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ప్రతి నియోజకవర్గంలో “మహిళా శక్తి...