
Komuravelli house burglary: కొమురవెల్లి, మే 30: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీగా బంగారం, వెండి, నగదు అపహరించిన ఘటన శనివారం నాడు వెలుగులోకి వచ్చింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన సార్ల భానుప్రియ, సురేష్ దంపతులు తమ ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ అవకాశాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూమ్లోని బీరువాను పగలగొట్టి, అందులో భద్రపరిచిన సుమారు మూడు తులాలన్నర బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 1,03,500 నగదును దోచుకెళ్లారు. మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం ఇంటికి వచ్చిన యజమాని సార్ల సురేష్.. ప్రవేశ ద్వారం తాళాలు పగిలి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. కంగారుగా లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా ధ్వంసమై సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. దాంతో ఆయన వెంటనే కొమురవెల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ తీవ్రతను బట్టి సిద్దిపేట నుండి క్లూస్ టీం (Clues Team) ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర కీలక సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితుల గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లను(Komuravelli house burglary) లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లను(Komuravelli house burglary) లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు పొరుగువారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని కోరారు. Minister Kondapalli Srinivas:ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..?:మంత్రి ! Mahila Shakti Super Markets: మహిళా శక్తి సూపర్ మార్కెట్లు: యెన్నం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Mahalaxmi Smart Card Telangana:మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం! Collector K Haritha:మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి! Bandaru Dattatreya:బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ! Addanki Dayakar: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ Balmoori Venkat: బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన డిమాండ్ అమెరికాలో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన ఒక భారతీయ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం పదేళ్ల కఠిన... తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి... సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు... ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్... లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రజలకు, రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోవడంపై... కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వినూత్నమైన కథాంశాలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.... ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త... బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం... ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో... 2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Komuravelli house burglary: కొమురవెల్లి, మే 30: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీగా బంగారం, వెండి, నగదు అపహరించిన ఘటన శనివారం నాడు వెలుగులోకి...