
Minister Kondapalli Srinivas: విజయనగరం, మే 30: అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు ఉండే గదులు ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఎలా? చిన్నారులు, బాలింతలు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉన్నా మీకు పట్టదా? అంటూ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP), ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని జామి, గంట్యాడ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జామి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంగా సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత అధ్వాన్నంగా ఉండటంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోగుల ఆన్లైన్ రికార్డులను పరిశీలించగా అవి సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిని నిలదీశారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను, రోగుల ఓపీ (OP) రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా బాలింతలు, చంటిబిడ్డలు ఉండే ఆపరేషన్ థియేటర్ గది అంతటా రక్తపు మరకలు, దుమ్ము ధూళి పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన మంత్రి.. అక్కడే ఉన్న డాక్టర్ సామ్రాజ్యలక్ష్మి మరియు వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో కుక్క కాటు, పాము కాటు ఇంజక్షన్ల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి.. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అలసత్వాన్ని వీడాలని, నెల రోజుల్లోగా ఆసుపత్రి సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం జామి ఆసుపత్రిలో కుక్క కాటు, పాము కాటు ఇంజక్షన్ల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి.. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అలసత్వాన్ని వీడాలని, నెల రోజుల్లోగా ఆసుపత్రి సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం జామి ఆసుపత్రి దుస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) తో ఫోన్లో మాట్లాడి, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. గంట్యాడ మండలం పెద్దమజ్జిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) ప్రశంసల జల్లు కురిపించారు. ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రతతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు పల్లవి, సతీష్ కుమార్ల నిబద్ధతను చూసి ‘శభాష్’ అంటూ అభినందించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను కలియతిరిగిన మంత్రి.. ప్రతి నెల బాలింతలకు నిర్వహించే వైద్య పరీక్షలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రజలు పట్టణాల్లోని ఆసుపత్రులకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. ముఖ్యంగా మండలంలోని డీకే పర్తి, వైకె పర్తి వంటి ట్రైబల్ (గిరిజన) గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత సులభంగా అందేలా చూడాలన్నారు. ఆస్పత్రిలోనే ప్రసవాలు (Deliveries) జరిగేలా గర్భిణీలలో అవగాహన కల్పిస్తున్నామని వైద్యులు తెలపడంతో మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే నిబద్ధతతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. Mahalaxmi Smart Card Telangana:మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం! Komuravelli house burglary:కొమురవెల్లిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Asian Games 2026 : వినేశ్ ఫోగాట్‌కు షాక్.. ఆసియా క్రీడల కల చెదిరింది Andhra Farmers News : ఖరీఫ్ రైతులకు గుడ్‌న్యూస్.. సాగునీటిపై కీలక నిర్ణయం Ravi Naidu: వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు: శాప్ చైర్మన్ రవినాయుడు AP DSC: డీఎస్సీ అక్రమాలకు ఆస్కారమే లేదు: కోన శశిధర్ Pawan Kalyan: జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన Tirumala Donation: తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం అమెరికాలో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన ఒక భారతీయ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం పదేళ్ల కఠిన... తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి... సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు... ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్... భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఉద్యోగులు తమ రోజువారీ పనులను... లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం