
రెండో టైటిల్‌పై బెంగళూరు, గుజరాత్ గురి ఐపీఎల్-19 తుదిపోరు నేడే రాత్రి 7.30 నుంచి అహ్మదాబాద్ కొన్ని జట్లు మొదట్లో అదరగొట్టి, తర్వాత తుస్సుమనిపించాయి.. కొన్ని జట్లు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముందంజ వేసి, అసలు సమరాల్లో చేతులెత్తేశాయి. చివరికి టోర్నీలో ఇప్పటిదాకా ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు మేటి జట్లే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో సమాన విజయాలతో టాప్-2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేర్చుకున్న ఆర్సీబీ, వరుసగా రెండో టైటిల్ పట్టేయాలని పట్టుదల ప్రదర్శిస్తుంటే.. ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి ఏడాదే ఛాంపియన్‌గా కావడమే కాక అయిదేళ్లలో మూడో ఫైనల్ ఆడబోతున్న జీటీ కూడా రెండో కప్పుపై కన్నేసింది. మరి ఆదివారం సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఫైనల్లో అ‘ద్వితీయ’ విజయాన్నందుకునే జట్టేదో? ప్రపంచ క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్లో ఈ సీజన్‌కు మిగిలింది ఇంకొక్కటే మ్యాచ్. రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన లీగ్‌లో ఆఖరి పోరుకు వేళైంది. ఆదివారం ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును.. 2022 విజేత గుజరాత్ టైటాన్స్ ఢీకొనబోతోంది. టోర్నీలో అత్యుత్తమ జట్ల మధ్యే ఫైనల్ జరుగుతుండడం.. ఆల్‌రౌండ్ బలంతో సమవుజ్జీల్లా కనిపిస్తున్న టీమ్స్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడం ఈ పోరుపై ఆసక్తిని పెంచుతోంది. ఇరు జట్లూ రెండో కప్పు మీదే గురి పెట్టడం విశేషం. తన సొంతగడ్డ అహ్మదాబాద్‌లో ఆడబోతుండడం గుజరాత్‌కు సానుకూలాంశం కాగా.. క్వాలిఫయర్-1లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ ఐపీఎల్లో మిగతా ఈ ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే గుజరాత్‌ది అంత బలమైన బ్యాటింగ్ ఆర్డరేమీ కాదు. ముఖ్యంగా మిడిలార్డర్ అయితే లీగ్‌లోనే అత్యంత బలహీనం అని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాతియా, హోల్డర్.. నాలుగో స్థానం నుంచి ఇదీ ఆ జట్టు బ్యాటింగ్ లైనప్. అయినా సరే జీటీ ఇంత నిలకడగా ఆడి, ఫైనల్‌కు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లతో కూడిన ఓపెనింగ్ జోడీ గుజరాత్‌కు అతి పెద్ద బలం. క్వాలిఫయర్-2లో బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉన్న పిచ్‌పై 215 పరుగుల భారీ లక్ష్యం నిలిచినా, గుజరాత్ ఏమాత్రం ఛేదించేసిందంటే అందుకు గిల్, సుదర్శన్ వేసిన తిరుగులేని పునాదే కారణం. ఈ జోడీ ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే, సుదర్శన్ అర్ధశతకం సాధించాడు. లీగ్ దశలో కూడా ఈ జోడీ అనేక మ్యాచ్‌ల్లో జట్టుకు అద్భుత ఆరంభాలందించింది. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల్లో 2, 3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. మూడో నంబర్లో ఆడే బట్లర్ సైతం 500 పైచిలుకు పరుగులు సాధించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. జీటీ బ్యాటింగ్ భారాన్ని చాలా వరకు ఈ ముగ్గురే మోస్తున్నారు. ఈ ముగ్గురూ విఫలమైన రోజు గుజరాత్‌కు ఇబ్బందే. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా ఔటైపోతే జీటీ పనైపోతుంది. క్వాలిఫయర్-1లో భారీ స్కోరు సాధించిన ఆర్సీబీ.. గిల్, సుదర్శన్‌లను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లోనూ ఇలాగే గుజరాత్‌ను దెబ్బ తీయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మిగతా బ్యాటర్లలో సుందర్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. నిశాంత్ సింధు, తెవాతియా, హోల్డర్లపై పెద్దగా అంచనాలు లేవు. జీటీ టాప్-3 బ్యాటర్లు విఫలమైతే.. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఏమేర జట్టును నిలబెడుతుందన్నది ప్రశ్నార్థకం. బెంగళూరు గత ఏడాది ఛాంపియన్ అయిందన్నా, ఈసారి కూడా ఆధిపత్యం చలాయిస్తూ ఫైనల్ చేరిందన్నా.. అందుకు ప్రధాన కారణం, ఒకప్పట్లా బ్యాటింగ్‌లో ఒకరిద్దరి మీద ఆధారపడే పరిస్థితి లేకపోవడం. ఒకరు పోతే ఇంకొకరు అన్నట్లుగా చాలామంది మ్యాచ్ విన్నర్లుండడం.. ఆరంభం నుంచి చివరి వరకు విధ్వంసం కొనసాగించే ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ నిండి ఉండడంతో ఆ జట్టుకు తిరుగులేకుండా పోతోంది. ఆ జట్టులో కాస్త ఆచితూచి ఆడేది కోహ్లి మాత్రమే. సీజన్ ప్రథమార్ధంలో ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు విధ్వంసక ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. అతను గాయపడ్డాక ఆర్సీబీ కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ.. ఆఖర్లో వెంకటేశ్ అయ్యర్ రూపంలో దూకుడైన బ్యాటర్ కలిసి వచ్చాడు. మూడో స్థానంలో ఆడే దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తాడు. క్వాలిఫయర్‌లో అతనెలా రెచ్చిపోయాడో తెలిసిందే. ఇంకా టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్‌ల రూపంలో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునివ్వగల బ్యాటర్లు ఆర్సీబీకి ఉన్నారు. ఎక్కువమంది హిట్టర్లు ఉండడం వల్ల ఆ జట్టు స్కోరు వేగం ఏ దశలోనూ తగ్గదు. లక్ష్యాలు పెద్దవైనా