
Home » Andhra Pradesh » Visakhapatnam » AP Home Minister Vangalapudi Anitha Calls for Grand Success of TDP Mahanadu VK ABN , Publish Date - May 24 , 2026 | 11:18 AM ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయ... క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. అనకాపల్లి జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) పిలుపునిచ్చారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. అనకాపల్లి జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. ఈరోజు (ఆదివారం) పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కల్యాణ మండపాలు, స్థలాలను పరిశీలించారు. అలాగే, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో మహానాడు ఏర్పాట్లును అనిత పరిశీలించారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. యస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్రలక్ష్మి, సాయిశంకర్కు ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు. తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని అభివర్ణించారు. తెలుగుజాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో మహానాడును వర్చువల్గా ఏర్పాటు చేసుకున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్ నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ Read Latest AP News And Telangana News And International News And Telugu News
Summary status: pending