
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి శుభసూచనలు ఉన్నాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు కలిసివస్తాయి. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశివారికి ఈ వారం స్థిరత్వం, పురోగతి ఉంటాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయాల్లో సానుకూల సంకేతాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. విదేశీ విద్య అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మిథున రాశివారు ఈ వారం చాలా చురుకుగా ఉంటారు. ఆలోచనా శక్తి, సంభాషణా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకం. వ్యాపారాలలో స్పష్టత అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశివారు ఈ వారం చాలా చురుకుగా ఉంటారు. ఆలోచనా శక్తి, సంభాషణా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకం. వ్యాపారాలలో స్పష్టత అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ వారం కర్కాటక రాశివారిని భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో కొంత ఒత్తిడి కనిపించినా, మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశివారికి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. విద్యార్థులకు సృజనాత్మకత పెరిగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. కన్య రాశివారికి ఈ వారం ప్రణాళికలు సఫలమయ్యే అవకాశం ఉంది. తెలివితేటలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు. వ్యాపారాలలో కొన్ని ఒప్పందాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. స్నేహితుల నుంచి మద్ధతు లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. పరిశోధన, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ వారం తుల రాశివారికి అనుకూలం. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడి, కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక విషయాల్లో ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కృషిని అధికారులు గుర్తించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో కొంత