
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ సంచలనంగా మారాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 26.75 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ సంచలనంగా మారాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 26.75 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. గతేడాది కెప్టెన్‌గా తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇప్పుడు కీలక సమయంలో సెంచరీతో రాణించిన పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శ్రేయస్‌పై ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాము వేలంలో శ్రేయస్ కోసం భారీగా వెచ్చించేందుకు కారణముందని రికీ తెలిపాడు. ‘‘మేం చేయాల్సిందంతా చేశాం. చాలా రోజుల తర్వాత మళ్లీ విజయం సాధించాం. మా బౌలర్లు చాలా బాగా రాణించారు. ప్రత్యర్థిని ఓ 20 పరుగులు తక్కువకే కట్టడి చేయగలిగారు. లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఆరంభంలో వికెట్ పడినా మా కుర్రాళ్లు వెనుకడుగు వేయలేదు. కెప్టెన్ శ్రేయస్ ఈ సీజన్ ఆసాంతం అదరగొట్టాడు. కీలక సమయంలో సెంచరీతో మెరిశాడు. రెండేళ్ల కిందట వేలంలో అతడి కోసం భారీగా వెచ్చించాం. దానికి కారణం శ్రేయస్ చాలా పరిణతితో ఆడే ప్లేయర్. మైదానంలో తన ఎమోషన్స్‌ను దాచిపెట్టుకోడు. సహచరుల నుంచి గౌరవం పొందుతాడు. ఫలితం ప్రతికూలంగా ఉన్నా సరే జట్టుపై నిందమోపడు. అతడితో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపిస్తోంది. మళ్లీ అతడిని టీమ్ఇండియా జట్టులో చూడబోతుండటం బాగుంది. గత ఆరు మ్యాచుల్లో మేం కొన్ని తప్పిదాలు చేశాం. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. ప్రభ్ సిమ్రన్ అద్భుత ప్లేయర్. భారత్ A జట్టుకు ఎంపిక కావడం అతడి శ్రమకు ప్రతిఫలం. మేం ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ముంబయి-రాజస్థాన్ మ్యాచ్ కీలకం. మేమంతా కలిసి ఆ మ్యాచ్‌ను చూస్తాం’’ అని రికీ పాంటింగ్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending