
ఇంటర్నెట్ డెస్క్: కీలక సమయంలో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచుల తర్వాత వచ్చిన గెలుపు ఇది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇంటర్నెట్ డెస్క్: కీలక సమయంలో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచుల తర్వాత వచ్చిన గెలుపు ఇది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై అద్భుత శతకంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (101*) రెచ్చిపోయాడు. ఐపీఎల్ కెరీర్లోనే తొలి సెంచరీ కావడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తమ ప్లేఆఫ్స్ అవకాశాలపై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ సీజన్లో తొలి శతకం నమోదు చేశా. జట్టుకు అత్యంత కీలక సమయంలో సెంచరీ కొట్టడం బాగుంది. వరుసగా ఆరు ఓటముల తర్వాత విజయం సాధించాం. ఇది మాకు సానుకూలాంశం. ఇక ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మా ఆశలన్నీ ముంబయి - రాజస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. మా అభిమానులు ముంబయికి మద్దతుగా నిలవాలని ఆశిస్తున్నా. లఖ్‌నవూపై మా బౌలర్ల ప్రదర్శన చాలా బాగుంది. తొలి ఓవర్లోనే 16 పరుగులు ఇచ్చినా.. తర్వాత పుంజుకొన్నాం. అజ్మత్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కీలక వికెట్‌ను తీసి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ పరుగులను నియంత్రించడంతోపాటు వికెట్లు పడగొట్టాడు. రిషభ్ పంత్‌ను ఔట్ చేశాడు. దూకుడుగా ఆడిన ఆయుష్ బదోనిని పెవిలియన్‌కు చేర్చాడు. అక్కడ్నుంచి లఖ్‌నవూ పరుగుల వేగం మందగించింది’’ అని శ్రేయస్ తెలిపాడు. ‘‘సహచరులకు పెద్ద ఉపన్యాసాలు ఇవ్వను. ఒకటే చెబుతా.. పరిస్థితులను సింపుల్‌గా ఉంచండి. అంతేకానీ, మీటింగ్‌లు పెట్టి కుర్రాళ్లను ఒత్తిడికి గురిచేయను. కీలక మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పిస్తా. అతిగా ఆలోచించే పరిస్థితిని వారికి రానివ్వను. మ్యాచ్‌కు ముందు కూడా రికీని అడిగా.. ఇవాళ ఎలాంటి మ్యాచ్ మీటింగ్‌లు వద్దని కోరా. నేరుగా మైదానంలోకి దిగి ఏం చేయాలో అదే చేద్దామని జట్టును ఉత్సాహపరిచా. ఇప్పుడు సానుకూల ఫలితం సాధించాం’’ అని కెప్టెన్ శ్రేయస్ వెల్లడించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending