కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి (84) వయోసహజమైన అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ బాధాకరమైన వార్త వినగానే తమిళ సినీ, రాజకీయ రంగాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. మోహిని మణికి అజిత్ కుమార్‌తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్ అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ కష్టసమయంలో అజిత్ కుటుంబాన్ని ఓదార్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందడుగు వేశారు. అజిత్ కుమార్ తల్లి మరణం పట్ల సీఎం విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఒక అధికారిక సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియ స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మాయియార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊహించని శోకంలో ఉన్న అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయ్, త్రిష పరామర్శ కేవలం సంతాప సందేశానికే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అజిత్ కుమార్ నివాసానికి వెళ్లారు. అయితే ఈ పరామర్శలో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సీఎం విజయ్‌తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా అజిత్ ఇంటికి వెళ్లడం. విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత, నటి త్రిషతో కలిసి బహిరంగంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. వారిద్దరూ కలిసి అజిత్ నివాసానికి చేరుకుని, మోహిని మణి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుత్రశోకంలో ఉన్న అజిత్ కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి (84) వయోసహజమైన అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ బాధాకరమైన వార్త వినగానే తమిళ సినీ, రాజకీయ రంగాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. మోహిని మణికి అజిత్ కుమార్‌తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్ అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ కష్టసమయంలో అజిత్ కుటుంబాన్ని ఓదార్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందడుగు వేశారు. అజిత్ కుమార్ తల్లి మరణం పట్ల సీఎం విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఒక అధికారిక సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియ స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మాయియార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊహించని శోకంలో ఉన్న అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయ్, త్రిష పరామర్శ కేవలం సంతాప సందేశానికే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అజిత్ కుమార్ నివాసానికి వెళ్లారు. అయితే ఈ పరామర్శలో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సీఎం విజయ్‌తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా అజిత్ ఇంటికి వెళ్లడం. విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత, నటి త్రిషతో కలిసి బహిరంగంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. వారిద్దరూ కలిసి అజిత్ నివాసానికి చేరుకుని, మోహిని మణి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుత్రశోకంలో ఉన్న అజిత్ కుమార్‌ను, ఆయన కుటుంబ సభ్యులను సీఎం విజయ్, త్రిషలు ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చారు. ఈ విషాద సమయంలో అజిత్ కుటుంబానికి కొండంత అండగా నిలిచేందుకు విజయ్, త్రిషలు ఒకేసారి రావడం అక్కడి వారిని కదిలించింది.వీడియోలు, ఫొటోలు వైరల్ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కలిసి అజిత్ ఇంటికి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ సీఎం అయిన తర్వాత త్రిషతో కలిసి తొలిసారి ఇలా కనిపించడంతో, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకవైపు అజిత్ తల్లి మృతికి సంతాపం తెలుపుతూనే, మరోవైపు విజయ్-త్రిషల రీ యూనియన్‌కి సంబంధించిన విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.