
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Adhika Jyeshtha Purnima 2026: ఈరోజు ఆదివారం.. అంతేకాకుండా పౌర్ణమి కూడా.. అది కూడా జ్యేష్ఠ పౌర్ణమి. అందుకే ఈరోజుకి చాలా విశిష్టత ఉంది. సూర్యచంద్రుల అనుగ్రహం కలిగించే ఒక శక్తివంతమైన మహా యోగం అంటున్నారు పండితులు. ఈ ఆదివారం సూర్యుడికి, పౌర్ణమి మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజులు. కనుక ఈరోజు పూజ చేసుకుని కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు. ఈ ఆదివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలానే స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరానికి, మనసుకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సింహద్వార పూజ.. ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి, మామిడి ఆకుల తోరణాలు కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఆర్థిక సమస్యల కోసం పరిహారం.. ఈ ఆదివారం నాడు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో ఐదు యాలకులు, ఐదు లవంగాలు, ఒక రూపాయి బిళ్ల వేసి మూట కట్టి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దానిని బీరువాలో పెట్టుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి ఆర్థిక సమస్యల కోసం పరిహారం.. ఈ ఆదివారం నాడు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో ఐదు యాలకులు, ఐదు లవంగాలు, ఒక రూపాయి బిళ్ల వేసి మూట కట్టి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దానిని బీరువాలో పెట్టుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి పసుపు రాసిన బూడిద గుమ్మడికాయ కట్టాలి. ఈరోజు చేయకూడని పనులు.. 1. పౌర్ణమి నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. 2. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరికీ పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, ఉప్పు లేదా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. 3. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం, గోర్లు తీయడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. 4. తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు. ఉప్పు దీపం.. మీ ఇంట్లో పేదరికం తొలగి ఆర్థికంగా కలిసి రావాలంటే ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెడితే మంచిది అంటున్నారు పండితులు. అందుకోసం ఈరోజు సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో కల్లుప్పు పోసి, దానిపై మరో దీపం పెట్టి వెలిగించాలి. దీనివల్ల పేదరికం తొలగి అఖండ రాజయోగం కలుగుతుందట. చంద్ర దర్శనం.. రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించుకుని.. రాగి లేదా వెండి గ్లాసులో పాలు, నీళ్లు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానం.. ఇంటి ముందుకు వచ్చే పేదవారికి లేదా సాధువులకు తోచినంత అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం. ఈ నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించడం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుందని మూలాలు పేర్కొంటున్నాయి. Also Read: TGSRTC Busses: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి మారనున్న బస్ చార్జీలు..అసలు మ్యాటర్ ఏమిటంటే.? Also Read: Gold Demand: బంగారం కొనడం తగ్గించిన భారతీయులు.. మోదీ నిర్ణయంతో 70శాతం పడిపోయిన డిమాండ్.. ధరలు ఇంకా తగ్గుతాయా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook