
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Horrific Road Accident in Gajuwaka Today: ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులలో భయాన్ని కలిగిస్తున్నాయి. బస్సుల్లో మంటలు రావడం, ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం గాజువాకలో కూడా ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ వైపు నుంచి వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు, శ్రీనగర్ దాటిన తర్వాత అతివేగంగా వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, బస్సు డ్రైవర్‌తోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వల్ల ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో పోలీసులు దానిని క్రమబద్ధీకరించారు. డ్రైవర్ అతివేగంతో ప్రయాణించడం, నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాజువాక సిగ్నల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, అయితే పెద్ద ప్రమాదం తప్పిందని కొందరు భావిస్తున్నారు. READ ALSO: దారుణం.. పంచాయితీ READ ALSO: దారుణం.. పంచాయితీ జరుగుతుండగానే ఊచకోత, తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి ఆరుగురి దారుణహత్య! READ ALSO: రెప్పపాటులో ఘోరం.. మహిళ దుర్మరణం, సిరిసిల్ల రోడ్డు ప్రమాదం లైవ్ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే! టైర్ పంక్చర్ అవ్వడంతో.. విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే ఆ హైవే ఒక్కసారిగా రక్తసిక్తం అయింది. రోడ్డుపై టైర్ పంచర్ కావడంతో ఒక లారీ పక్కకు ఆగి ఉండగా, అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. బస్సు డ్రైవర్‌తో పాటు పక్కనే క్యాబిన్లో ఉన్న రెండో డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. గాజువాక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షేమంగా ఉన్న ప్రయాణికులను వేర్వేరు వాహనాల్లో వారి స్వంత గ్రామాలకు పంపించారు. ఈ ఘటన వల్ల అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీనగర్ - గాజువాక సిగ్నల్ పాయింట్స్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, ఆ సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలు లేదా జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైవేపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే వాహనాలను క్లియర్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి